Tamanna : చిరిగిన దుస్తులు వేసుకుని గ్లామ‌ర్ షో చేస్తూ.. త‌మ‌న్నా ర‌చ్చ ర‌చ్చ‌..!

January 28, 2022 11:51 AM

Tamanna : త‌మ‌న్నా సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 10 ఏళ్ల‌కు పైగానే అవుతోంది. అయిన‌ప్ప‌టికీ అప్ప‌ట్లో ఎలా ఉందో.. ఆమె ఇప్పుడు కూడా అలాగే ఉంది. గ్లామ‌ర్ షోను కూడా అలాగే మెయింటెయిన్ చేస్తోంది. ఇటీవ‌లే నితిన్ మ్యాస్ట్రో సినిమాలో నెగెటివ్ రోల్ పోషించి ఆక‌ట్టుకుంది. కుర్ర హీరోయిన్ల మోజులో త‌మ‌న్నాకు కాస్త ఆఫ‌ర్లు త‌గ్గాయి. అయిన‌ప్ప‌టికీ అగ్ర హీరోల స‌ర‌స‌న ఇప్ప‌టికీ ఈమె ఆఫ‌ర్ల‌ను కొట్టేస్తూనే ఉంది.

Tamanna appeared at airport with torn jeans

2021లో త‌మ‌న్నా ప‌లు వెబ్ సిరీస్‌ల‌లోనూ న‌టించింది. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఎలెవెన్త్ అవ‌ర్‌, న‌వంబ‌ర్ స్టోరీ అనే వెబ్ సిరీస్‌ల‌లో త‌మ‌న్నా అల‌రించింది. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌కు చెందిన ప‌లు మూవీల్లోనూ త‌మ‌న్నా న‌టిస్తోంది. ఎక్కువ‌గా ఈమెకు ప్ర‌స్తుతం అగ్ర హీరోల ప‌క్క‌న చాన్స్‌లు వ‌స్తున్నాయి.

వ‌రుణ్ తేజ్ గ‌ని మూవీలో త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్ చేస్తోంది. ఇక హిందీలో ప్లాన్ ఎ ప్లాన్ బి సినిమా, క‌న్న‌డ‌లో రెండు మూవీల్లో ఈమె న‌టిస్తోంది. తెలుగులో వెంక‌టేష్ స‌ర‌స‌న ఎఫ్‌3 చేస్తోంది. చిరంజీవి ప‌క్క‌న భోళా శంక‌ర్ మూవీలోనూ ఈమె చాన్స్ కొట్టేసింది. స‌త్య‌దేవ్‌తో క‌లిసి గుర్తుందా శీతాకాలం సినిమాలో న‌టిస్తోంది.

ఇక ఎప్ప‌టిక‌ప్పుడు గ్లామ‌ర్ షో చేస్తూ ఫొటోషూట్‌ల‌తోనూ త‌మ‌న్నా అల‌రిస్తోంది. తాజాగా ఈమె ఎయిర్‌పోర్టులో త‌ళుక్కుమంది. చిరిగిన జీన్స్ వేసుకుని అందాల‌ను ఆర‌బోస్తూ ర‌చ్చ చేసింది. ఈ క్ర‌మంలో త‌మ‌న్నా ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment