రూ.6 కోట్ల విలువ చేసే కార్ కొన్న ప్ర‌భాస్‌.. ప‌ట్ట‌రాని ఆనందంలో ఫ్యాన్స్‌..!

March 29, 2021 11:27 AM

సెల‌బ్రిటీల‌కే కాదు, ఎవ‌రికైనా స‌రే కార్ల‌పై వ్యామోహం ఉంటుంది. లగ్జరీ కార్ల‌ను కొని వాడేందుకు వారు ఆస‌క్తిని చూపిస్తుంటారు. అందులో భాగంగానే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కూడా ఓ కొత్త కార్ కొన్నాడు. లంబోర్గిని అవెంట‌డార్ మోడ‌ల్ కారును ప్ర‌భాస్ కొనుగోలు చేశాడు. దాని ఖ‌రీదు అక్ష‌రాలా రూ.6 కోట్లు అని తెలుస్తోంది. ప్ర‌భాస్ కొన్న ఆ కారుకు చెందిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

prabhas bought rs 6 crores valued  Lamborghini Aventador

ప్ర‌భాస్ కొత్త కారు ఫొటోల‌ను చూసిన అత‌ని అభిమానులు ప‌ట్ట‌రానంత ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. రాజుకు కొత్త ర‌థం వ‌చ్చింద‌ని, ప్ర‌భాస్ కారు కొన్నందుకు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు అని.. ర‌క ర‌కాలుగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

prabhas bought rs 6 crores valued  Lamborghini Aventador

కాగా ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డెతో అత‌ను క‌లిసి న‌టించిన రాధే శ్యామ్ ఈ ఏడాది జూలై 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రొమాంటిక్ మూవీగా రాధే శ్యామ్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ మ‌రో మూవీ చేయ‌నున్నాడు. అందులో అమితాబ్ బ‌చ్చ‌న్‌, దీపికా ప‌దుకునేలు న‌టించ‌నున్నారు. ఇక ఓమ్ రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆది పురుష్ అనే మూవీ కూడా నిర్మాణ‌మ‌వుతోంది. అందులో సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడిగా న‌టిస్తుండ‌గా, కృతి స‌న‌న్‌, స‌న్నీ సింగ్‌లు సీత‌, ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

https://twitter.com/_Baluprabhas/status/1376223672986300417

 

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment