Priyanka Chopra : స‌రోగ‌సి ప‌ద్ధ‌తిలో త‌ల్లైన ప్రియాంక చోప్రా.. ప్రైవ‌సీ క‌ల్పించండి అంటూ విజ్ఞ‌ప్తి..

January 22, 2022 12:54 PM

Priyanka Chopra : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది సెల‌బ్రిటీలు పిల్ల‌ల్ని క‌నేందుకు అంత‌గా ఆస‌క్తిని చూపించ‌డం లేదు. కానీ స‌రోగ‌సీ మార్గాన్ని వారు ఎంచుకుంటున్నారు. కొంద‌రు సెల‌బ్రిటీలు వ‌యస్సు అయిపోయాక స‌రోగ‌సి ద్వారా పిల్ల‌ల్ని క‌ని వాళ్ల‌కు తోడుగా ఉంటార‌ని పెంచుకుంటుంటే.. కొంద‌రు మాత్రం వ‌య‌సులో ఉన్నా కూడా స‌రోగ‌సి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇక హాలీవుడ్ క‌పుల్ ప్రియాంక చోప్రా, నిక్ జోన‌స్ దంప‌తులు కూడా స‌రోగ‌సి ద్వారానే బిడ్డ‌ను క‌న్నారు. ఈ విష‌యాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్వ‌యంగా వెల్ల‌డించింది.

Priyanka Chopra and nick jonas couple blessed with baby

మాకు స‌రోగ‌సి ప‌ద్ధ‌తిలో బిడ్డ జ‌న్మించింది. ఈ ప్ర‌త్యేక‌మైన స‌మ‌యంలో మా కుటుంబానికి కాస్తంత ప్రైవ‌సీ క‌ల్పించండి.. అంద‌రికీ థాంక్ యూ.. అని ప్రియాంక పోస్ట్ పెట్టింది.

కాగా అమెరిక‌న్ సింగర్ అయిన నిక్ జోన‌స్‌ను ప్రియాంక చోప్రా 2018లో ఇండియాలోనే పెళ్లి చేసుకుంది. ఆమె అత‌ని క‌న్నా ఏకంగా 10 ఏళ్ల వ‌య‌స్సు పెద్ద‌ది కావ‌డం విశేషం. ఇటీవ‌ల వీరిద్ద‌రూ ఓ మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌మ స‌రోగ‌సి విష‌యాన్ని నిర్దారించారు. తాజాగా వీరికి బిడ్డ జ‌న్మించ‌డం విశేషం.

ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబ‌ల్ స్టార్ గా మారింది. ప‌లు హాలీవుడ్ సినిమాల్లో ఈమె న‌టిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment