Sreeja : భ‌ర్త నుంచి విడాకులు తీసుకోనున్న చిరంజీవి కుమార్తె శ్రీ‌జ..? సాక్ష్యం అదేనా..?

January 18, 2022 2:28 PM

Sreeja : ప్ర‌స్తుతం చాలా మంది సెల‌బ్రిటీల జంట‌లు విడాకులు తీసుకుంటున్నారు. గ‌తంలో బాలీవుడ్ న‌టుడు అమీర్‌ఖాన్ త‌న భార్య‌కు విడాకులు ఇవ్వ‌గా.. టాలీవుడ్ క్యూట్ క‌పుల్‌గా పేరొందిన స‌మంత‌, నాగ‌చైత‌న్య‌లు కూడా విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాజాగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె సౌంద‌ర్య‌, ఆమె భర్త ధ‌నుష్‌లు విడిపోతున్న‌ట్లు చెప్పారు. దీంతో సెల‌బ్రిటీ జంట‌ల విడాకుల విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

Sreeja reportedly taking divorce from kalyan dhev

ఇక చిరంజీవి కుమార్తె శ్రీ‌జ కూడా త‌న భ‌ర్త క‌ల్యాణ్ దేవ్ నుంచి విడిపోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. శ్రీ‌జ నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌న భ‌ర్తను యాడ్ చేసి సోష‌ల్ ఖాతాల్లో పేర్లు పెట్టుకుంది. శ్రీ‌జ క‌ల్యాణ్ అని ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ఇత‌ర సామాజిక మాధ్య‌మాల్లో ఆమె పేరు ఉండేది. అయితే ఆమె తాజాగా త‌న పేరును మార్చుకుంది. క‌ల్యాణ్ తీసేసి ఆ స్థానంలో కొణిదెల అని పెట్టుకుంది. ప్ర‌స్తుతం శ్రీ‌జ కొణిదెల అనే పేరు క‌నిపిస్తోంది. దీంతో వారు విడిపోతున్నార‌ని.. అందుకు సాక్ష్యం ఇదేన‌ని అంటున్నారు.

గ‌తంలో స‌మంత కూడా అక్కినేని అనే ఇంటి పేరును త‌న సోష‌ల్ ఖాతాల నుంచి తీసేసి కేవ‌లం ఎస్ అనే ఆంగ్ల అక్ష‌రాన్ని మాత్ర‌మే పెట్టుకుంది. దీంతో స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోతార‌ని పుకార్లు షికార్లు చేశాయి. త‌రువాత అవే నిజ‌మ‌య్యాయి. వారు విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇక ఇప్పుడు శ్రీ‌జ కూడా అలాగే పేరును మార్చేయ‌డంతో.. శ్రీ‌జ‌, క‌ల్యాణ్ దేవ్‌లు విడిపోతున్నారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా ఈ మ‌ధ్య కాలంలో క‌ల్యాణ్ దేవ్ కూడా మెగా పార్టీల్లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అలాగే అత‌ని తాజా మూవీ సూప‌ర్ మ‌చ్చిని మెగా ఫ్యామిలీ ఎవ‌రూ ప్ర‌మోట్ చేయ‌డం లేదు. దీంతో శ్రీ‌జ‌, క‌ల్యాణ్ ల విడాకులు నిజ‌మే అని అనుమానాలు క‌లుగుతున్నాయి. వారిద్ద‌రూ విడాకుల కోసం కోర్టులో ద‌ర‌ఖాస్తు చేశార‌ని.. అందుక‌నే శ్రీ‌జ త‌న పేరు మార్చింద‌ని అంటున్నారు. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంది ? అన్న‌ది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now