Manchu Lakshmi : ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ పాత్ర‌లో అల‌రించ‌నున్న మంచు ల‌క్ష్మి..?

January 9, 2022 12:20 PM

Manchu Lakshmi : మంచు ల‌క్ష్మి ఏం చేసినా సంచ‌ల‌న‌మే. ఆమె సోష‌ల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే చాలు, అది వివాదాల‌కు కేరాఫ్‌గా నిలుస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే మంచు ల‌క్ష్మి గురించిన వార్త‌లు వైర‌ల్ అవుతుంటాయి. ఇక ఇటీవ‌లే ఆమె ఓ పోస్టు పెట్టి నెటిజ‌న్ల చేత విమ‌ర్శ‌ల పాలైంది. త‌న‌కు ఓ షూటింగ్‌లో గాయాలు అయిన‌ట్లు ఫొటోలు పెట్ట‌గా.. అవి అస‌లు గాయాలు కావ‌ల‌ని తేల‌డంతో.. ఆమెను అంద‌రూ విమ‌ర్శించారు.

Manchu Lakshmi to appear in powerful police character

ఇక మంచు ల‌క్ష్మి త్వ‌ర‌లో ఓ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో అల‌రించ‌నుంది. ఓ మూవీలో ఆమె పోలీసు పాత్ర చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ప‌లు వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల్లో మంచు ల‌క్ష్మి న‌టించి మెప్పించింది. దీంతో త్వ‌ర‌లో పోలీస్ పాత్ర‌లోనూ ఆమె క‌నిపించ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె పోలీస్ గెట‌ప్ వేయ‌లేదు. తొలిసారిగా ఈ క్యారెక్ట‌ర్‌లో ఆమె న‌టిస్తుండ‌డంతో.. ఆమె వేష ధార‌ణ‌, యాక్టింగ్ ఎలా ఉంటుందోన‌ని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇక దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

మంచు ల‌క్ష్మికి ప్ర‌స్తుతం కోవిడ్ పాజిటివ్ రాగా ఇంట్లోనే ఐసొలేష‌న్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటోంది. త్వ‌ర‌లోనే ఈమె మాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేయ‌నుంది. ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్‌లాల్ చిత్రంలో మంచు ల‌క్ష్మి న‌టిస్తోంది. ఈ విష‌యాన్ని ఇది వ‌ర‌కే అధికారికంగా ప్ర‌క‌టించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment