News : భార్య అక్ర‌మ సంబంధం పెట్టుకుంద‌నే అనుమానంతో.. న‌రికి చంపేశాడు..

January 2, 2022 9:55 PM

News : దేశ రాజ‌ధాని ఢిల్లీలో అత్యంత దారుణ‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి త‌న భార్య‌ను అతి కిరాత‌కంగా హ‌త‌మార్చాడు. ఆమెకు ఇంకొక వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం ఉంద‌ని అనుమానించిన అత‌ను ఆగ్ర‌హంతో ఊగిపోయి ఆమెపై దాడి చేసి చంపేశాడు. వివ‌రాల్లోకి వెళితే..

News  man killed his wife over suspicion of illicit affair

ఢిల్లీలోని చాందిని మ‌హ‌ల్ ఏరియాలో నివాసం ఉండే అబ్దుల్ ర‌హ‌మాన్ అనే వ్య‌క్తి త‌న భార్య (32)ను త‌ర‌చూ వేధింపుల‌కు గురి చేసేవాడు. ఆమె ఇంకో వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంద‌ని త‌ర‌చూ ఆమెను వేధించ‌డ‌మే కాక‌.. ఆమెను చిత్ర‌హింస‌లు పెట్టేవాడు. ఇద్ద‌రి మ‌ధ్యా త‌ర‌చూ గొడ‌వ‌లు కూడా జ‌రుగుతుండేవి. వీరికి ఒక కుమార్తె ఉంది.

కాగా గ‌త శుక్ర‌వారం య‌థావిధిగా ఆ దంప‌తుల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. దీంతో ప‌ట్ట‌రాని ఆవేశంతో ఊగిపోయిన ర‌హ‌మాన్ త‌న భార్య‌పై దాడి చేసి ఆమెను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. క‌త్తితో న‌రికేశాడు. అనంత‌రం అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. అదే రోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో ట్యూష‌న్ నుంచి ఇంటికి వ‌చ్చిన కుమార్తె త‌న త‌ల్లి ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉండ‌డాన్ని చూసి హ‌తాశురాలైంది. దీంతో వెంట‌నే విష‌యాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్ప‌గా.. వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

స్థానికుల ద్వారా స‌మాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకుని ఆ మ‌హిళ మృత‌దేహాన్ని పోస్టుమార్టంకు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ర‌హ‌మాన్ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టగా.. అత‌ను ఢిల్లీలోని క‌మ‌లా మార్కెట్ పోలీసుల‌కు అక్క‌డి ఖ్వాజా మీర్ ద‌ర్ద్ అనే ప్రాంతంలో దొరికాడు. దీంతో అత‌న్ని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. ఆ స‌మ‌యంలో అత‌ను ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌తో కూడిన చొక్కా ధ‌రించి ఉన్నాడ‌ని పోలీసులు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now