Samantha Chaithanya : వారి కోసం స‌మంత‌ – చైతన్య మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్నారా..!

December 30, 2021 10:05 AM

Samantha Chaithanya : టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ చైత‌న్య‌-స‌మంత విడాకుల నిర్ణ‌యం చాలా మందికి పెద్ద షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట అక్టోబ‌ర్ 2న తాము విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. విడాకుల తర్వాత నాగ చైతన్య ఎటువంటి కామెంట్స్ చేయలేదు. అతను పూర్తి మౌనం వహిస్తుంచాడు. సమంత మాత్రం తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇస్తూ వస్తోంది.

Samantha Chaithanya may appear in that ad together

సమంత విడాకుల డిప్రెషన్ నుండి బయటపడటానికి మిత్రులతో ఎక్కువగా గడుపుతోంది. వరుసగా విహార యాత్ర‌ల‌కు వెళుతోంది. అయితే విడాకుల త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసింది లేదు. రామానాయుడు స్టూడియోలో ఒక‌రికొకరు ఎదురు ప‌డినా కూడా ముఖాలు కూడా చూసుకోలేద‌ని టాక్. అయితే ఇప్పుడు వీరు కలిసి ఉన్నపుడు కోల్గేట్ టూత్ పేస్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉన్నారు. ‘కోల్గేట్ మౌత్ ఫ్రెష్’కు నాగచైతన్య, ‘కోల్గేట్ సాల్ట్‌’కు సమంత ప్రమోటర్స్‌గా ఉన్నారు.

స‌మంత‌-చైతూ విడిపోవ‌డం వ‌ల్ల కంపెనీకి పెద్ద ఇబ్బందే వ‌చ్చింద‌ట‌. నాగచైతన్య, సమంతల డైవోర్స్ వల్ల తమకు ఇబ్బంది వచ్చిందనే చర్చ ముంబై యాడ్ ఏజెన్సీ వర్గాల్లో ఉందట. ప్రొఫెష‌న‌ల్‌గా వీరిద్ద‌రూ క‌లిసి ప‌ని చేస్తారా లేదంటే ఎడ‌ముఖం పెడ‌ముఖంగానే ఉంటారా అనేది ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

నాగచైతన్య ప్రస్తుతం బంగార్రాజు, థాంక్యూ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు సమంత చేతిలో ‘శాకుంతలం’, ‘యశోద’, ‘కాతువాకుల రెండు కాదల్‌’, ‘అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ ప్రాజెక్టులు ఉన్నాయి. వరుణ్‌ ధావన్‌తో ఓ వెబ్‌ సిరీస్‌ కూడా చేయనుందని టాక్‌ వినిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment