Samantha : బికినీలో స‌మంత‌.. అస్సలు తగ్గడం లేదుగా..!

December 28, 2021 10:24 AM

Samantha : ఇటీవ‌లి కాలంలో స‌మంత నిత్యం వార్త‌ల‌లో నిలుస్తోంది. క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సమంత నాగచైతన్యతో పెళ్లి తర్వాత ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కూడా వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో చాలా చాలా హాట్‌గా క‌నిపించిన స‌మంత పుష్ప సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌తో అద‌ర‌గొట్టింది.

Samantha latest bikini photo viral in social media

గతంలో ఎప్పుడు లేని విధంగా సమంత మొదటిసారి ఐటమ్ సాంగ్ చేసింది. ఇక ఆ పాట కోసం ఆమెకు రూ.కోటిన్నర వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. గ‌త కొద్ది రోజులుగా వార్త‌ల‌లో నిలుస్తూ అంద‌రికీ షాక్ ఇస్తున్న స‌మంత గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆమె బికినీలో స్మైల్ ఇచ్చి కుర్రాళ్లకు షాక్ ఇచ్చింది. ఈ పిక్ పై నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. గోవాలో ఆ ఫొటో దిగినట్లుగా తెలుస్తోంది. తన స్నేహితులతో దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సమంత విడాకుల అనంతరం ఎక్కువగా తన స్నేహితులతో విహార యాత్రలు చేస్తోంది. మనకు నచ్చిన విధంగా స్వేచ్ఛగా ఉండాలనే విధంగా కొటేషన్స్ కూడా ఇస్తోంది. అయితే సామ్ బికినీ స్టిల్‌పై కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. ఏంటి ఈ దారుణం అంటూ మండిప‌డుతున్నారు. స‌మంత ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment