Upasana : ఉపాస‌న డ్రెస్ ఖ‌రీదు తెలిస్తే ఉలిక్కిప‌డాల్సిందే..!

December 28, 2021 9:09 AM

Upasana : మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన అప్పుడ‌ప్పుడూ వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంటుంది. ఆమె ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌తో అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంటూ ఉంటోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ.. ఫిట్‏నెస్ గురించి.. ఆయుర్వేద వైద్యం, జంతువుల సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ.. వీడియోస్ షేర్ చేస్తుంటుంది. ఇటీవ‌ల రెండు సింహాల‌ను ద‌త్త‌త తీసుకోగా, వాటి కోసం రూ. 2 లక్షల చెక్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఎస్.రాజశేఖర్‏కు అందించింది.

do you know the cost of dress of Upasana

ఇక తాజాగా క్రిస్మ‌స్ వేడుక‌ల‌లో కూడా మెరిసిన ఉపాస‌న అంద‌రి దృష్టి త‌న‌పై ప‌డేలా చేసింది. వేడుక‌లో ఆమె ధ‌రించిన డ్రెస్ ధ‌ర ప్ర‌స్తుతం చర్చ‌నీయాంశంగా మారింది. చూడడానికి సాధారణంగా కనిపిస్తున్న ఈ డ్రెస్‌ ధర మాత్రం మామూలుగా లేదు. డోల్స్‌ అండ్‌ గబ్బానా బ్రాండ్‌కు చెందిన ఈ డ్రెస్‌ ఖరీదు రూ.2.50 లక్షలట. ఇది విన్న నెటిజన్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అంత సాదాసీదాగా ఉన్న ఆ డ్రెస్‌ను అన్ని లక్షలు పెట్టి కొన్నారా ? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మెగా ఫ్యామిలీ రెండుగా చీలి పోయిందా ?.. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కు విభేదాలొచ్చాయా ?.. నందమూరి ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ దగ్గరైందా ? అనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇటీవల జరిగిన పరిస్థితులే అభిమానుల్లో ఈ అనుమానాలకు తావిచ్చాయి. వాట‌న్నింటికీ తాజాగా జ‌రిగిన క్రిస్మ‌స్ వేడుక పుల్‌ స్టాప్ పెట్టింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment