Nagma : న‌గ్మా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఇదేనా ?

December 27, 2021 8:04 PM

Nagma : అల‌నాటి అందాల తార నగ్మా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎంతో మంది స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన అల‌రించిన న‌గ్మా రాజ‌కీయాల‌లోను రాణిస్తోంది. అయితే చివరిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు సినిమాలో అత్త పాత్రలో నటించింది. కేవలం తెలుగు భాషలోనే కాకుండా తమిళ భాషలో కూడా నటించి నంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు.

why Nagma  not married is this is the reason

న‌గ్మా వ‌య‌స్సు 45 సంవత్సరాలు అయినా కూడా ఆమె ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. కానీ తన జీవితంలో చాలా మంది పురుషులతో సంబంధం కలిగి ఉన్నట్లు వార్తలు వినిపించాయి. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, నటి నగ్మా ప్రేమాయ‌ణం న‌డిపిన‌ట్టు వార్త‌లు వినిపించాయి. సౌరవ్ గంగూలీతో విడిపోయిన అనంతరం ఆమె దక్షిణ భారత నటుడు అయిన శరత్ కుమార్ తో ప్రేమలో పడింది. శరత్ కుమార్ నగ్మాను కలిసినప్పటికీ అప్పటికే అతనికి వివాహం అయ్యింది.

దక్షిణ భారత సినిమాలకు వీడ్కోలు చెప్పిన తర్వాత న‌గ్మా ముంబైకి షిఫ్ట్ అయ్యింది. భోజ్ పురి చిత్రాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంది. అక్కడ సూపర్ స్టార్ రవి కిషన్ తో కలిసి పలు సినిమాల్లో నటించింది. ఇక ఆ తర్వాత అప్పటికే వివాహం అయిన రవి కిషన్ కు పడిపోయింది. రవి బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొనడానికి వెళ్ళాడు. దీంతో వారి మధ్య దూరం ఏర్పడడంతో కొన్నేళ్ళ తర్వాత ఇద్దరు నటులు విడిపోయారు.

నగ్మా రవితో చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తరువాత, భోజ్ పురి లో మరో నటుడైన మనోజ్ తివారితో ప్రేమలో పడింది. కానీ ఒక ఇంటర్వ్యూలో నగ్మా వారి మధ్య ఉన్న సంబంధాన్ని ఖండిస్తూ నేను అతనితో కలిసి పని చేస్తున్నాను, అంతే కానీ మా మధ్య ఎటువంటి సంబంధం లేదు, దయచేసి నన్ను విడిచి పెట్టండి.. అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఇప్ప‌టికీ న‌గ్మా ప్రేమ వ్య‌వ‌హారం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment