Flipkart : ఫ్లిప్‌కార్ట్‌లో క్రిస్మ‌స్ సంద‌ర్భంగా జింగిల్ డేస్ సేల్‌.. భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు టీవీలు..!

December 24, 2021 5:15 PM

Flipkart : ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ క్రిస్మ‌స్ సంద‌ర్భంగా త‌న సైట్‌లో జింగిల్ డేస్ పేరిట‌ ఓ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ సేల్ డిసెంబ‌ర్ 25న ప్రారంభం కానుండ‌గా.. 29వ తేదీన ముగియ‌నుంది. ఇందులో భాగంగా టీవీల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందివ్వ‌నుంది.

Flipkart announces jingle days sale huge discount on TVs

ఈ సేల్‌లో భాగంగా Blaupunkt అనే కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీల‌ను ఏకంగా 30 శాతం డిస్కౌంట్‌కు విక్ర‌యించ‌నున్నారు. 32 ఇంచులు మొద‌లుకొని 65 ఇంచుల సైజ్ ఉన్న టీవీల‌కు ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల‌తో అయితే మ‌రో 10 శాతం అద‌న‌పు డిస్కౌంట్ ల‌భిస్తుంది. పాత టీవీల‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.11వేల వ‌ర‌కు ఇస్తారు.

Blaupunkt కంపెనీకి చెందిన సైబ‌ర్ సౌండ్ మోడ‌ల్ 32 ఇంచుల టీవీ ధ‌ర రూ.13,499 ఉండగా.. ఇందులో హెచ్‌డీ డిస్‌ప్లే, 40 వాట్ల స్పీక‌ర్ అవుట్ పుట్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే ఇదే కంపెనీకి చెందిన 42 ఇంచుల మోడ‌ల్ ధ‌ర రూ.20,999 గా ఉంది.

Blaupunkt కు చెందిన 43 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ మోడ‌ల్ టీవీ ధ‌ర రూ.27,999 గా ఉంది. 50 ఇంచుల టీవీ ధ‌ర రూ.34,999, 55 ఇంచుల టీవీ ధ‌ర రూ.39,999, 65 ఇంచుల టీవీ ధ‌ర రూ.54,999 గా ఉంది. వీటిలో డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్ ను కూడా అందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment