Ashu Reddy : స‌మంత మాదిరిగా స్టెప్పులేసిన అషూ రెడ్డి.. సోష‌ల్ మీడియా షేక్ అవ్వాల్సిందే..!

December 23, 2021 9:22 AM

Ashu Reddy : విశాఖపట్నం అమ్మాయి అషు రెడ్డి సోష‌ల్ మీడియాతో చాలా పాపులారిటీ తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో మరింత హల్‌చల్ చేస్తోంది. ఫలితంగా బుల్లితెరపై అవకాశాలను అందుకుంటూ ముందుకు వెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా అందాలను ఆరబోస్తూ హాట్ టాపిక్ అవుతోంది. చాలా కాలం క్రితం వచ్చిన డబ్‌స్మాష్ వీడియోల ద్వారానే అషు రెడ్డి విపరీతంగా పాపులర్ అయింది. చూడ్డానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండడంతో ఈమె కొన్ని లక్షల మంది ఫాలోవ‌ర్స్‌ని సంపాదించుకుంది.

Ashu Reddy danced for samantha item song in pushpa movie

సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారే అషూ రెడ్డి తాజాగా ఊ అంటావా మావ ఊహూ అంటావా మావా అనే మాస్ సాంగ్‌కి త‌న‌దైన స్టెప్పులు వేసింది. సోష‌ల్ మీడియాలో ఈ సాంగ్‌కి సంబంధించిన ఫొటో స్టిల్స్ కొన్ని షేర్ చేయ‌గా, ఇందులో అషూ స్టిల్స్ కొన్ని స‌మంత మాదిరిగా క‌నిపిస్తున్నాయి. ఈ పిక్స్ నెటిజ‌న్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. వీడియో సాంగ్ కోసం క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తున్నారు.

అగ్రకథానాయిక సమంత పుష్ప సినిమా కోసం ‘ఊ అంటావా మావ ఊహూ అంటావా మావా’ అనే పాట‌లో అందాలు ఆర‌బోస్తూ డ్యాన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ పాట‌కు సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించ‌గా, చంద్రబోష్‌ ఈ పాటని రాశారు. ఇంద్రావతి చౌహాన్‌ ఆలపించారు. ఈ పాటని ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అవుతుండడం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now