Sunny : కులం పిచ్చి ఏంది మ‌చ్చా.. గూగుల్‌లో స‌న్నీ కులం కోసం వెతుకులాట‌..!

December 22, 2021 7:33 PM

Sunny : బిగ్ బాస్ సీజ‌న్ 5 విజేత స‌న్నీ ఇప్పుడు అంద‌రి నోళ్ల‌ల్లో తెగ నానుతున్నాడు. అతని గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 1989లో ఖమ్మంలో పుట్టిన సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. సన్నీ తల్లి కళావతి స్టాఫ్ నర్సుగా పనిచేస్తుండేవారు. సన్నీకి ఇద్దరు అన్నయ్యలు ఉజ్వల్, స్పందన్. ఇక సన్నీ స్కూలింగ్ మొత్తం ఖమ్మంలోనే పూర్తిచేశాడు.

what is Sunny cast netizen searching for him

చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్నాడు సన్నీ. అతను వేసిన అల్లాదీన్ నాటకానికి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత జస్ట్ ఫర్ మెన్ అనే టీవీ షోతో యాంకర్‏గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో రిపోర్టర్‏గా పనిచేశాడు. తన కెరీర్‏లో పలువురు సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు సన్నీ. బిగ్ బాస్ సీజ‌న్ 5లోకి అడుగుపెట్టిన స‌న్నీ త‌న‌దైన శైలిలో గేమ్ ఆడుతూ అంద‌రి మ‌న‌సులను గెలుచుకున్నాడు.

గ‌తంలో ఎప్పుడు కూడా స‌న్నీ కుల ప్ర‌స్తావ‌న బ‌య‌ట‌కు తీయ‌ని కొంద‌రు కుల పిచ్చోళ్లు ఇప్పుడు గూగుల్‌లో అతని కులం కోసం తెగ వెతుకులాడేస్తున్నారు. మా అరుణ్ రెడ్డి గెలిచాడు. చూశార్రా మా అరుణ్ రెడ్డి బిగ్ బాస్ టైటిల్ కొట్టాడంటూ.. అతని ఫ్యాన్ పేజ్‌లోనే కొంతమంది కులపిచ్చోళ్లు పోస్ట్‌లు పెడుతున్నారు. నిజానికి సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి అని చాలామందికి తెలియదు. బిగ్ బాస్ లో ఉన్న‌ప్పుడు ఎక్క‌డా కూడా అత‌ను త‌న కుల ప్ర‌స్తావ‌న తీసుకురాలేదు. కానీ కొంద‌రు కుల పిచ్చోళ్లు నానా ర‌చ్చ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment