Vijay Devarakonda : విజయ్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మ‌ధ్య ఏం న‌డుస్తోంది..? ఒకే కారులో ముంబైలో చ‌క్క‌ర్లు..!

December 21, 2021 11:08 AM

Vijay Devarakonda : బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ ప‌లు జంట‌లు సైలెంట్‌గా ఎఫైర్స్ న‌డుపుతున్నాయి. వీరిలో కొంద‌రు పెళ్లి వ‌ర‌కు తమ ఎఫైర్‌కి సంబంధించిన వ్య‌వ‌హారం బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. మ‌రి కొంద‌రు మాత్రం కెమెరాల‌కు చిక్కుతూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటించిన ‘గీత గోవిందం’ సూపర్‌ డూపర్‌ హిట్‌ గా నిలిచింది. ఆ తర్వాత ‘డియర్‌ కామ్రేడ్‌’లోనూ వీరు స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు.

Vijay Devarakonda and rashmika mandanna what is happening between them

బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాల‌లో న‌టించ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య క్లోజ్ నెస్ మ‌రింత పెరిగింది. వారి మధ్యన సమ్‌థింగ్‌ సమ్‌థింగ్ నడుస్తోందంటూ గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. అప్పుడప్పుడూ జంటగా బయటికెళ్లిన ఫొటోలు ఈ రూమర్లకు మరింత బలాన్నిచ్చాయి. తాజాగా ఈ జంట ముంబైలో మరోసారి కెమెరాలకు దొరికిపోయింది. బాంద్రాలోని రెస్టారెంట్‌లో ఆదివారం రాత్రి డిన్నర్‌ డేట్‌ ముగించుకుని బయటకు వచ్చిన వీళ్లిద్దరూ కెమెరాలకు చిక్కారు.

ముందుగా విజయ్‌ రెస్టారెంట్‌ నుంచి బయటకు వచ్చి కారులో కూర్చోగా తర్వాత రష్మిక వెనకాలే వచ్చి అతడి కారెక్కింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూశాక నెటిజన్లు.. ఈ ఇద్దరి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ న‌డుస్తోంది.. అంటూ జోస్యాలు చెబుతున్నారు. మొత్తానికి విజయ్‌, రష్మికల డిన్నర్‌ డేట్‌ మాత్రం ఇప్పుడు అంత‌టా హాట్ టాపిక్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now