Mutton : బాబోయ్‌.. క‌నీవినీ ఎరుగ‌ని ఆఫ‌ర్‌.. కిలో మ‌ట‌న్ రూ.50 మాత్ర‌మే..!

December 20, 2021 5:44 PM

Mutton : ప్ర‌స్తుతం చికెన్ రేటు ఏమోగానీ మ‌ట‌న్ రేటు అయితే కొండెక్కి కూర్చుంది. మ‌ట‌న్ తిందామంటేనే గుండె గుభేల్ మ‌నేట్లు రేట్లు ఉన్నాయి. కేజీకి దాదాపుగా రూ.700 నుంచి కొన్ని చోట్ల రూ.800 వ‌ర‌కు మ‌ట‌న్ ధ‌ర ప‌లుకుతోంది. ఇక గొర్రె పొట్టేలు అయితే రూ.500 వ‌ర‌కు ధ‌ర ఉంటోంది. కానీ అక్క‌డ మాత్రం దాన్ని కేవ‌లం రూ.50కే విక్ర‌యించారు. అవును.. ఇది నిజ‌మే..

kilo Mutton rs 50 only at that place big offer

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరు జిల్లా పీలేరు వాల్మీకిపురంలో మాంసం విక్రయ‌దారులు పోటీలు ప‌డి మ‌రీ మ‌ట‌న్‌ను అమ్మారు. ఆదివారం సాయంత్రం ఒక్క‌సారిగా మ‌ట‌న్ ధ‌ర అమాంత ప‌డిపోయింది. కిలో పొట్టేలు లేదా మేక మాంసం ఏది కొన్నా స‌రే కేవ‌లం రూ.50కే ఇచ్చారు. దీంతో ప్ర‌జ‌లు పోటీలు ప‌డి మ‌రీ ఒక్కొక్క‌రు 5 నుంచి 10 కిలోల వ‌ర‌కు మ‌ట‌న్ కొనేశారు.

స్థానికంగా ఉన్న గాంధీ బ‌స్ స్టాండ్ వ‌ద్ద ఓ దుకాణ‌దారుడు ముందుగా రూ.300కు కిలో మ‌ట‌న్ అని బోర్డు పెట్టాడు. దీంతో ప్ర‌జ‌లు ఎగ‌బ‌డి కొన్నారు. అయితే అత‌న్ని చూసిన ఇత‌ర షాపుల వారు సైతం పోటీలు ప‌డి మ‌రీ మ‌ట‌న్ ధ‌ర‌ల‌ను ఒకేసారి త‌గ్గిస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ధ‌ర రూ.300 నుంచి రూ.200, రూ.100కు ప‌డిపోయింది. త‌రువాత ఒక ద‌శ‌లో ఒక దుకాణ‌దారుడు కేవ‌లం రూ.50 కే కిలో మ‌ట‌న్ ఇస్తాన‌ని చెప్ప‌డంతో ప్ర‌జ‌లంతా అటు ప‌రుగులు తీశారు. పెద్ద ఎత్తున మ‌ట‌న్‌ను కొన్నారు. దీంతో రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు మాంసం మొత్తం అమ్ముడు పోయింది. దుకాణ‌దారులు పోటీ ప‌డి మ‌రీ ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డంతోనే ఈ విధంగా స్పంద‌న ల‌భించింద‌ని అంటున్నారు.

అయితే అక్క‌డ నిజానికి ఇత‌ర ప్రాంతాల‌తో పోలిస్తే గ‌త వారం ప‌ది రోజుల నుంచి మ‌ట‌న్ ధ‌ర‌లు త‌క్కువే ఉన్నాయి. కిలో మ‌ట‌న్‌ను రూ.400కు విక్ర‌యిస్తున్నారు. ఇత‌ర ప్రాంతాల్లోని మ‌ట‌న్ ధ‌ర‌తో పోలిస్తే ఇది త‌క్కువే కావ‌డం విశేషం. కానీ చికెన్ మాత్రం కేజీకి రూ.160 చొప్పున య‌థావిధిగా అమ్ముడైంది. ధ‌ర త‌గ్గలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now