Lobo Bigg Boss : చిరు ప‌క్క‌న న‌టించే ఛాన్స్ కొట్టేసిన లోబో..!

December 9, 2021 9:36 AM

Lobo Bigg Boss : స్టార్ మా ఛానెల్స్‌లో వీజేగా ప‌ని చేసి ఆ త‌ర్వాత ప‌లు షోల‌లో త‌న కామెడీతో సంద‌డి చేసిన లోబో బిగ్ బాస్ షోతో మ‌రింత పాపుల‌ర్ అయ్యాడు. లోబో గత సీజన్‌లో అవినాష్ మాదిరిగా మారిపోయి ఫుల్ కామెడీని పంచాడు. జనాలు, ప్రేక్షకులు చూస్తారు.. ఎంటర్టైనర్ అంటూ తనకు తాను ప్రకటించుకున్నాడు. అలా లోబో మొత్తానికి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సీక్రెట్ రూంలోకి లోబోను పంపించినా కూడా ఆటను మలుపు తిప్పలేకపోయాడు.

Lobo Bigg Boss got the chance to act with chiranjeevi

బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ అందుకున్న లోబోకి ఇప్పుడు ప‌లు సినిమా ఆఫ‌ర్స్ త‌లుపు తడుతున్నాయి. అందులో చిరంజీవి చిత్రం ఒక‌టి. రీసెంట్‌గా ఓ టీవీ షోలో పాల్గొన్న లోబో.. చిరంజీవి సినిమా ఆఫర్‌పై మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘ సినిమాలో నాది చిరు సార్‌ని అంటిపెట్టుకుని ఉండే పాత్ర. మెగాస్టార్‌ పక్కన నటించడం అంటే తన కల సాకారమైనట్లే’ అని సంబర పడిపోయాడు. దీంతోపాటు ఈ సినిమాను మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

చిరంజీవి – మెహ‌ర్ ర‌మేష్ కాంబినేష‌న్‌లో భోళా శంక‌ర్ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఈ సినిమా తమిళ ‘వేదాళం’ తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కీర్తి సురేశ్‌ చిరు సోదరిగా కనిపించనుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఇందులో కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now