Janhvi Kapoor : జాన్వీ క‌పూర్‌ను పెద్ద ఎత్తున విమ‌ర్శిస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే..?

December 4, 2021 6:00 PM

Janhvi Kapoor : సినిమా సెల‌బ్రిటీలు అన్నాక త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. వారు చేసే ప‌నుల‌తోపాటు వారు సోష‌ల్ మీడియాలో పెట్టే కామెంట్స్‌, వారు ప్ర‌వ‌ర్తించే తీరు కూడా.. వారు వార్త‌ల్లో నిలిచేందుకు కార‌ణ‌మ‌వుతుంటాయి. ఈ క్ర‌మంలోనే హీరోయిన్లు ఎక్కువ‌గా నెటిజ‌న్ల చేతిలో విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతుంటారు. ఇక ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీల‌పై ట్రోలింగ్‌, విమ‌ర్శ‌లు ఎక్కువ‌య్యాయ‌నే చెప్ప‌వ‌చ్చు.

netizen troll and criticize Janhvi Kapoor for doing that

అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి కుమార్తె జాన్వీ క‌పూర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ ఈమెకు ఒక్క హిట్ కూడా లేదు. న‌టిగా గుర్తింపు పొందినా హిట్ సినిమాలు త‌న ఖాతాలో లేవు. దీంతో ఈ అమ్మ‌డు ఇంకా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటూనే ఉంది.

జాన్వీ క‌పూర్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న విష‌యాల‌ను సోష‌ల్ మీడియాలో అప్‌డేట్ చేస్తుంటుంది. ఎక్కువ‌గా ఈమె వెకేష‌న్ కు వెళ్తుంది. ఫొటోషూట్ లు చేస్తుంది. ఆయా ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేస్తుంటుంది. దీంతో త‌న గ్లామ‌ర్ ఫొటోలు యువ‌త‌కు నిద్ర‌లేకుండా చేస్తుంటాయి.

అయితే జాన్వీక‌పూర్‌ను నెటిజ‌న్లు తాజాగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ విమ‌ర్శిస్తున్నారు. అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈమె త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి ఒక చోటుకు వెళ్లింది. అక్క‌డ ఫొటోగ్రాఫ‌ర్లు చేరి ఫొటోల‌కు పోజులు ఇవ్వ‌మ‌ని అడిగారు. అయితే ఆమె ఫొటోల‌కు పోజులు ఇవ్వ‌కుండా వెళ్లి కారులో కూర్చుంది. దీంతో ఆ వీడియోను కొంద‌రు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్ర‌మంలోనే జాన్వీక‌పూర్‌ను నెటిజ‌న్లు విమ‌ర్శించ‌డం మొద‌లు పెట్టారు.

ఫొటోలు తీసుకుంటామ‌ని అడిగితే పోజులు ఇవ్వ‌కుండా యాటిట్యూట్ చూపిస్తుంది చూడు.. అంటూ నెటిజ‌న్లు జాన్వీ క‌పూర్‌ను విమ‌ర్శిస్తున్నారు. దీంతో ఆమెపై ప్ర‌స్తుతం ట్రోల్స్ ఎక్కువ‌య్యాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment