Bigg Boss 5 : బిగ్ బాస్ హౌస్‌లోకి యాంక‌ర్‌ ర‌వి రీ ఎంట్రీ..? వైల్డ్ కార్డ్ రూపంలో..?

December 3, 2021 6:01 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 గ్రాండ్ ఫినాలెకి ఇంకా 3 వారాల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. బిగ్ బాస్ ఇంట్లో ప్ర‌స్తుతం 7 మంది స‌భ్యులు ఉన్నారు. చివ‌రి వారం యాంక‌ర్ ర‌వి ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు. వాస్త‌వానికి యాంక‌ర్ ర‌వి మొద‌టి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్నాడు. టాప్ 5లో ఉండ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ భావించారు. కానీ అత‌ని ఎలిమినేష‌న్ ఫ్యాన్స్‌కు షాకిచ్చింది.

Bigg Boss 5 anchor ravi may re enter into the house as wild card entry

బిగ్ బాస్ ఇంటి నుంచి ర‌విని ఎలిమినేట్ చేయ‌డం అన్యాయ‌మ‌ని అత‌ని ఫ్యాన్సే కాదు, ప్రేక్ష‌కులు కూడా అంటున్నారు. ఇది ఎంత‌మాత్రం క‌రెక్ట్ కాద‌ని, పూర్తిగా అన్యాయంగా ర‌విని ఎలిమినేట్ చేశార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ర‌వి బిగ్ బాస్ ఇంట్లోకి మ‌ళ్లీ ప్ర‌వేశించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

యాంక‌ర్ ర‌వి ఎలిమినేష‌న్ త‌రువాత అత‌ని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ ఎదుట ఆందోళ‌న చేప‌ట్టారు. ర‌విని అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ మండిప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ర‌విని తిరిగి ఇంట్లోకి ప్ర‌వేశ‌పెట్టాల‌ని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక స్టార్ మా కూడా ర‌విని తిరిగి తీసుకురావాల‌నే ఆలోచిస్తున్న‌ద‌ట‌. ర‌విని ఇంట్లో నుంచి ఎలిమినేట్ చేశాక‌.. స్టార్ మా మాత్ర‌మే కాక‌.. అటు నాగార్జున కూడా అప్ర‌తిష్ట‌ను మూట‌గ‌ట్టుకున్నార‌ని.. చాలా మంది బ‌హిరంగంగానే విమ‌ర్శించారు.

ర‌వి ఎలిమినేష‌న్‌కు ముందు వాస్త‌వానికి ఆర్‌జే కాజ‌ల్ కూడా డేంజ‌ర్ జోన్‌లో ఉంది. అంత‌కు ముందు వారాల్లో అనారోగ్యంతో జెస్సీ ఎలిమినేట్ అవ‌గా.. కాజ‌ల్ సేవ్ అయ్యింది. అయితే కాజ‌ల్ అప్ప‌టి నుంచి డేంజ‌ర్ జోన్‌లోనే ఉంది. అలాంటిది ఆమెను కాకుండా ర‌విని ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఫ్యాన్స్ మండిప‌డ్డారు. ర‌వికి ఓట్లు కూడా ఎక్కువ‌గానే వ‌చ్చాయి. దీంతో అత‌ని ఎలిమినేష‌న్ క‌రెక్ట్ కాద‌ని చాలా మంది అన్నారు.

ఇక స‌న్నీ త‌న వ‌ద్ద ఉన్న ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్‌ను కాజ‌ల్‌ను సేవ్ చేసేందుకు ఉప‌యోగించాడు. ఈ క్ర‌మంలో ర‌వి వెనుక‌బ‌డిన‌ట్లు చెప్పారు. అయితే ర‌వి బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో మ‌ళ్లీ వ‌స్తాడ‌ని అంటున్నారు. కానీ దీనిపై అధికారిక స‌మాచారం లేదు. అయితే ఫినాలె ద‌గ్గ‌ర ప‌డుతున్న ఈ స‌మ‌యంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ దాదాపుగా అసాధ్య‌మ‌నే చెప్పాలి. ఏదైనా అద్భుతం జ‌రిగితేనే ర‌వి రీ ఎంట్రీ సాధ్య‌ప‌డుతుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment