Samantha : తిండిక‌న్నా త‌న‌కు ఆ ప‌నే ముఖ్య‌మంటున్న స‌మంత‌.. వీడియో వైర‌ల్‌..!

December 3, 2021 5:36 PM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకుల‌ను ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత ఫుల్ జోరు మీద ఉంది. అనేక సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోంది. అందులో భాగంగానే ఆమె త్వ‌ర‌లో ఓ బాలీవుడ్ మూవీని, ఓ హాలీవుడ్ మూవీని కూడా చేయ‌నుంది. ఇక పుష్ప‌లో ప్ర‌స్తుతం స‌మంత ఓ ఐట‌మ్ సాంగ్‌లో న‌టిస్తోంది. ఇందుకు గాను ఆమె ఏకంగా రూ.1.50 కోట్లు అందుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అయితే స‌మంత‌కు చెందిన ఓ పాత వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Samantha says she prefers more that work than food

2017లో స‌మంత జ‌స్ట్ ఫ‌ర్ వుమ‌న్ అనే ఓ మ్యాగ‌జైన్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగా జ‌ర్న‌లిస్టు అడిగిన ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో ఓ ప్ర‌శ్న‌కు స‌మంత బ‌దులిచ్చింది. శృంగారం, తిండి.. రెండింటిలో దేన్ని కోరుకుంటారు ? అని అడ‌గ్గా.. అందుకు స‌మంత బ‌దులిస్తూ.. శృంగారమే అని చెప్పింది.

అయితే ఈ ప్ర‌శ్న‌కు ముందుగా కొద్దిగా త‌ట‌ప‌టాయించినా.. వెంట‌నే తేరుకుని శృంగారం అని స‌మాధానం ఇచ్చింది. అది లేకుండా మ‌హా అయితే ఒక్క రోజే ఉండ‌గ‌ల‌న‌ని చెప్పింది. కాగా ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment