దేశంలో క‌రోనా విస్ఫోట‌నం.. ఒకే రోజు రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు..

May 6, 2021 10:56 AM

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. ఒకే రోజులో మ‌ళ్లీ రికార్డు స్థాయిలో కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 4,12,262 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 3,980 మంది చ‌నిపోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రోజులో అత్యంత ఎక్కువ స్థాయిలో మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం కూడా ఇదే తొలిసారి. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

highest number of covid cases reported in last 24 hours in india

ఇక దేశంలో మొత్తం కోవిడ్ మ‌ర‌ణాల సంఖ్య 2,30,168కి చేరుకుంది. 35,66,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,20,113 మంది గ‌డిచిన 24 గంట‌ల్లో డిశ్చార్జి అయ్యారు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,72,80,844కు చేరుకుంది. ఇక ఒకే రోజులో 4 ల‌క్ష‌లకు పైగా కోవిడ్ కేసులు నమోదు కావ‌డం ఇది రెండో సారి. మే 1వ తేదీన 4,01,993 కేసులు న‌మోద‌య్యాయి.

మే 5వ తేదీన భారత్‌లో 3.82 ల‌క్ష‌ల కోవిడ్ కేసులు న‌మోదు కాగా 3,780 మంది ఒకే రోజులో చ‌నిపోయారు. ఇక 3 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోదు కావ‌డం వ‌రుస‌గా ఇది 15వ రోజు. ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మొత్తం 29,67,75,209 శాంపిల్స్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రీక్షించింది. ఒక్క మే 5వ తేదీనే 19,23,131 శాంపిల్స్ ను ప‌రీక్షించారు.

దేశంలో మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, ఉత్త‌ర ప్ర‌దేశ్‌, కేర‌ళ‌, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌గ‌డ్‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్ బీహార్‌, హ‌ర్యానాల‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోదు అవుతుండ‌డమే కాగా యాక్టివ్ కేసులు కూడా ఎక్కువ‌గానే ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment