Bigg Boss 5 : నా కూతురిని వ‌ద‌ల్లేదు.. డ‌బ్బు కోసం త‌ల్లిదండ్రుల గురించి కూడా త‌ప్పుగా రాస్తారా..!

December 3, 2021 10:26 AM

Bigg Boss 5 : బుల్లితెర స్టార్ యాంక‌ర్ ర‌వి బిగ్ బాస్ సీజ‌న్ 5లో సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. టాప్ 5లో అత‌ను త‌ప్ప‌క ఉంటాడ‌నుకున్న ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురైంది. 12వ వారం హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు రవి. అయితే ఊహించ‌ని ఎలిమినేష‌న్ కార‌ణంగా అనేక అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. యాంకర్ రవి ఎలిమినేషన్ ను తట్టుకోలేకపోయిన అత‌ని ఫ్యాన్స్.. బిగ్ బాస్‌లో రవికి అన్యాయం జరిగిందంటూ ఆందోళనకు దిగారు.

Bigg Boss 5 anchor ravi emotional for trolls on his daughter

రవి లేకుంటే అసలు బిగ్ బాస్ ఎందుకు ? అంటూ మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రవిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలని ఆందోళన కూడా చేపట్టారు. కానీ అవ‌న్నీ ఇప్పుడు అసాధ్యాలు. అయితే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత రవి.. తొలిసారి తన ఇన్‏స్టా లైవ్‏లోకి వచ్చాడు. ఇందులో బిగ్ బాస్ షో గురించి.. మీమ్స్ రాయుళ్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ ఇంట్లో జరిగేది ఒకటైతే.. బయటకు మరొకటి చూపిస్తున్నారని రవి అన్నాడు.

బిగ్ బాస్ ఇంట్లో కాకుండా.. బయట కూడా మరోలా ఉంటుందని.. వాళ్లు చూపించేదాన్ని బట్టి మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారని.. కంటెస్టెంట్స్ ను ప్రమోట్ చేసేందుకు డబ్బులు తీసుకుంటారు. అది తప్పు అని నేను అనను.. కానీ నేను బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే ముందు కూడా చెప్పాను. ట్రోల్స్, మీమ్స్ ఏవైనా ఉంటే నన్ను ఇష్టమొచ్చినట్లు వాడుకోండని చెప్పాను. కానీ.. అలా కాకుండా నా ఫ్యామిలీ జోలికి వచ్చారు. నా భార్య మీద.. నా కూతురి మీద కూడా ట్రోల్స్ చేశారు. దీనికి ఓ బ్యాచ్ ఉంది. వారిని ఏం అనాలో కూడా తెలియడం లేదు. వాళ్లకు ఓ రెండు వేల రూపాయలు ఇస్తే వాళ్లింట్లో వాళ్లను కూడా ట్రోల్స్ చేస్తారు.. అంటూ రవి ఆవేదన వ్యక్తం చేశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment