Samantha : విడాకుల తర్వాత సమంతను ప్రోత్సహిస్తున్న తల్లి..!

December 1, 2021 5:02 PM

Samantha : విడాకుల ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలోనే విడాకుల బాధలో ఉన్న సమంత తనకు తాను ధైర్యం చెప్పుకోవడానికి తన మనసులోని భావాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. మై మామ్ సెయిడ్ అంటూ చెప్పుకొస్తోంది. ఇలా సమంత ఎన్నో ప్రేర‌ణాత్మ‌క‌ కొటేషన్స్ ను పోస్ట్ చేస్తూ తనలో తాను ధైర్యాన్ని నింపుకుంటోంది.

Samantha : విడాకుల తర్వాత సమంతను ప్రోత్సహిస్తున్న తల్లి..!

అయితే జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముందుకు నడవాలని తన తల్లి తనకు ఎన్నో సార్లు చెప్పింద‌ని తెలిపింది. ఇక తన విడాకుల ప్రకటన తర్వాత కూడా సమంత విషయంలో తన తల్లి వెనుక ఉండి తనని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమంతకు ధైర్యం నింపే పోస్టులను సెండ్ చేస్తూ తనకు అండగా నిలబడిందని.. తాజాగా సమంత చేసిన పోస్ట్ ద్వారా తెలుస్తోంది.

సమంత లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముక్కలైన నా జీవితాన్ని తిరిగి అందంగా మార్చుకోగలను అనే విషయం నీకు తెలియదు.. అనే మాటలు సమంత ధైర్యాన్ని ప్రతిబింబిస్తున్నట్లుగా ఉన్నాయి. దీంతోపాటు గాడ్ బ్లెస్స్ యూ మై బేబీ అంటూ కిస్, లవ్ ఎమోజీలను షేర్ చేసిన పోస్టును సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment