Sirivennela : సిరివెన్నెల పార్ధివ దేహాన్ని చూసి క‌న్నీరు పెట్టుకున్న బాల‌కృష్ణ‌..!

December 1, 2021 10:46 AM

Sirivennela : త‌న ప‌దాల‌తో ప్ర‌తి ఒక్క‌రికీ ఆహ్లాదాన్ని పంచిన లెజండ‌రీ రైట‌ర్ సిరివెన్నెల మంగళవారం సాయ‌త్రం 4 గంటల 7 నిమిషాల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల అస్తమించడంతో సినీ ప్రపంచం మూగబోయింది. కవిత్వానికి ఒంపులు, అక్షరంలో అందాలు గుర్తించిన ఆయన ఇక తిరిగి రారాని తెలిసి అంద‌రూ శోక‌సంద్రంలో మునిగారు. ఆయన పార్థివదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్ధం ఫిల్మ్ చాంబర్ లో ఉంచారు.

Sirivennela : సిరివెన్నెల పార్ధివ దేహాన్ని చూసి క‌న్నీరు పెట్టుకున్న బాల‌కృష్ణ‌..!

సిరివెన్నెల‌కు తుది నివాళులు అర్పించడానికి పలువురు సినీ ప్రముఖులు ఫిలింఛాంబర్‌కు తరలివస్తున్నారు. బుధవారం ఉదయం సిరివెన్నెల పార్థివదేహాన్ని త్రివిక్రమ్, రాజమౌళి, కీరవాణి, విక్టరీ వెంకటేష్, సాయికుమార్, తనికెళ్ల భరణి, మణిశర్మ, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎస్వీ కృష్ణారెడ్డి, మారుతి, మురళీమోహన్, నందినీరెడ్డి తదితరులు సందర్శించి నివాళులర్పించారు. తాజాగా హీరో నందమూరి బాలకృష్ణ కూడా సిరివెన్నెల భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Sirivennela : సిరివెన్నెల పార్ధివ దేహాన్ని చూసి క‌న్నీరు పెట్టుకున్న బాల‌కృష్ణ‌..!

సిరివెన్నెల‌ని ఇలా చూసి చాలా ఎమోష‌న‌ల్ అయిన ఆయ‌న .. ఈరోజు చాలా దుర్దినం అని… ఒక నమ్మలేని నిజం… ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 1984లో విశ్వనాథ్ దర్శకత్వంలో తాను నటించిన జననీ.. జన్మభూమి.. చిత్రంతోనే సిరివెన్నెల సినీ పరిశ్రమకు పరిచయం కావడం తన అదృష్టమన్నారు. సిరివెన్నెల లేరంటే చిత్ర పరిశ్రమ శోక సముద్రంలో ఉన్నట్లు ఉందన్నారు. సిరివెన్నెల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని స్పష్టం చేశారు. పుట్టినవారు గిట్టక తప్పదు.. కానీ 66 ఏళ్ళకే సిరివెన్నెల వెళ్లిపోయారంటూ బాలయ్య కంటతడి పెట్టుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment