Tollywood : సిరివెన్నెల మ‌ర‌ణం.. వాయిదా ప‌డ్డ ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్, భీమ్లా నాయ‌క్ సాంగ్..

December 1, 2021 12:14 PM

Tollywood : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన సాహితీ ర‌చ‌యిత‌ల‌లో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి ఒక‌రు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో న్యుమోనియాకు చికిత్స పొందుతూ నవంబర్ 30న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల పార్థివదేహాన్నిమధ్యాహ్నం వరకు అక్కడ ఉంచి 12 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Tollywood : సిరివెన్నెల మ‌ర‌ణం.. వాయిదా ప‌డ్డ ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్, భీమ్లా నాయ‌క్ సాంగ్..

సిరివెన్నెల మ‌ర‌ణంతో ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ విడుదల వాయిదా పడింది. డిసెంబర్‌ 3న ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ముందుగా నిర్ణయించింది. అయితే సీతారామశాస్త్రి కన్నుమూతతో దీనిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌ విడుదల కొత్త తేదీని త్వరలోనే చెబుతామంటూ తెలిపింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ భీమ్లా నాయక్ ఫోర్త్‌ సింగిల్‌ అడవి తల్లి పాట విడుదల వాయిదాపడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ పాటను డిసెంబర్ 1న ఉదయం 10:08 గంటలకు విడుదల చేయాల్సి ఉంది. అయితే తాజాగా సాంగ్‌ రిలీజ్‌ను పోస్ట్‌పోన్‌ చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది.

కవిత్వానికి ఒంపులు, అక్షరంలో అందాలు గుర్తించిన సిరివెన్నెల‌కు అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. ఉత్తమ గీత రచయితగా 11 సార్లు నంది అవార్డు అందుకున్నారు. సీతారామశాస్త్రి తెలుగు సినిమాకు రాసిన మొదటి పాట.. విధాత తలపున.. దీంతో అవార్డులు అందుకోవడం ఆయనకు మొదలైంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment