Karthika Deepam : బస్తీలో సెటిల్ అవ్వనున్న డాక్టర్ బాబు, వంటలక్క.. మోనిత రాక్షస ప్లాన్స్ ?

November 30, 2021 10:06 AM

Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్‌లో హిమ.. అమ్మ నాన్న ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని అనుకుంటుంది. అంతలోనే శౌర్య వచ్చి బస్తీలో ఇల్లు కడుతున్న విషయాన్ని చెబుతుంది. వెంటనే హిమ సంతోషంగా ఫీల్ అవుతుంది. అక్కడ ఉంటే అందరూ ఉంటారు. సంతోషంగా ఉంటుందని అనుకుంటారు. మరోవైపు మోనిత సంతోషంగా కార్తీక్ ఫోటో చూస్తూ మురిసిపోతుండగా ప్రియమణి ఆశ్చర్యపోతుంది.

Karthika Deepam : బస్తీలో సెటిల్ అవ్వనున్న డాక్టర్ బాబు, వంటలక్క.. మోనిత రాక్షస ప్లాన్స్ ?

ఇక ప్రియమణిని చూసిన మోనిత నేను ఇలాగే ఉంటాను అంటూ కార్తీక్ నుండి దీపను వేరు చేయాలని అంటుంది. తక్కువ చదువుకున్నా కూడా ల్యాబ్ లో నిజాన్ని పసిగట్టిందని అనుకుంటుంది. దీప పని ఎలాగైనా చేయాలనుకుంటుంది.

సౌందర్య ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుంటూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఇక అందరూ ఒక చోట ఉండి బస్తీ సైట్ గురించి మాట్లాడుకుంటారు. కార్తీక్ తనను హాస్పిటల్ లో డాక్టర్ అసోసియేషన్ అధికారిగా ఎన్నుకుంటున్నారని చెప్పడంతో సంతోషంగా ఫీల్ అవుతారు.

మోనిత ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతుంది. దీప అందరికీ చూపించిన వీడియోను తలుచుకుంటూ మండిపడుతుంది. అప్పుడే డాక్టర్ భారతి ఫోన్ చేసి హాస్పిటల్‌లో డాక్టర్ అసోసియేషన్ మెంబర్‌గా కార్తీక్ ను ఎన్నుకుంటున్నామని.. రావట్లేదా.. అనేసరికి మోనిత రానని క్లారిటీ ఇస్తుంది.

వెంటనే భారతి కార్తీక్ కు ఫోన్ చేసి మోనిత రానన్న విషయాన్ని చెప్పడంతో రిలీఫ్ అవుతాడు. మరోవైపు సౌందర్య, ఆనందరావు కూడా బయల్దేరుదామని అనుకుంటుండగా ఆదిత్య వచ్చి ఎక్కడికని అడుగుతాడు.

కార్తీక్ అందుకుంటున్న గుర్తింపు గురించి చెబుతూ శ్రావ్యను తీసుకొని రమ్మని అంటుంది. ఆదిత్య మాత్రం అక్కడకు మోనిత వస్తుంది కదా మళ్లీ అక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయని అనేసరికి తను రావట్లేదని చెబుతుంది.

ఆదిత్యను రమ్మని అనడంతో ఇవాళ దీపుని ఇంటికి తీసుకు వస్తానని అక్కడికి వెళ్తున్నామని అంటాడు. తరువాయి భాగంలో దీప, కార్తీక్ అసోసియేషన్ ఎన్నికల దగ్గరికి వెళ్తారు. సౌందర్య కార్తీక్ గురించి మాట్లాడటంతో మోనిత ఎంట్రీ ఇచ్చి షాకిస్తుంది. ఇక దీప కూడా రివర్స్ లో మోనితను గట్టి దెబ్బ కొడుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment