Bigg Boss 5 : నామినేష‌న్స్‌తో వేడెక్కిన బిగ్ బాస్‌.. ఈ వారం డేంజ‌ర్ జోన్‌లో ఎవ‌రున్నారో తెలుసా?

November 30, 2021 7:23 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్యక్ర‌మంలో గ‌త వారం ర‌వి రూపంలో ఊహించ‌ని ఎలిమినేష‌న్ జ‌రిగింది. టాప్ 3లో ఉంటాడ‌నుకున్న ర‌విని ఇలా మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కు పంప‌డాన్ని అంద‌రూ త‌ప్పు ప‌డుతున్నారు. దీని గురించి బ‌య‌టే కాదు ఇంట్లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డిచింది. మరోపక్క మానస్‌.. తనకు టైటిల్ ముఖ్యం కాదు, ప్రజల మనసులు గెలవడమే ముఖ్యమన్నాడు. ఈ మధ్య ప్రియాంకను కనీసం ముట్టుకోవడం లేదన్నాడు. ఆమెకు ఎలాంటి ఫీలింగ్స్‌ వస్తున్నాయో అన్న భయంతో హగ్‌ చేసుకోవడం మానేశానని చెప్పుకొచ్చాడు.

Bigg Boss 5 : నామినేష‌న్స్‌తో వేడెక్కిన బిగ్ బాస్‌.. ఈ వారం డేంజ‌ర్ జోన్‌లో ఎవ‌రున్నారో తెలుసా?

ఇక ర‌వి లేని బాధ ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పుకొచ్చింది ప్రియాంక‌. నా చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఫీలవుతున్నప్పుడు నాకు కనిపించే వ్యక్తి రవి అన్నయ్య, అతడు లేకపోతే నాకు ధైర్యం లేనట్లు అనిపిస్తోందని బాధపడింది పింకీ. మరోపక్క షణ్ను వద్దంటున్నా సిరి హగ్గివ్వడానికి వెళ్లింది. అతడు ఎంత వారించినా వినకుండా ఫ్రెండ్‌షిప్‌ హగ్గంటూ షణ్నును హత్తుకుంది సిరి. మొన్న ఎపిసోడ్‌లో చాలా రియ‌లైజ్ అయినట్టు ఫీలైన సిరి మ‌ళ్లీ హ‌గ్ ఇవ్వ‌డం ఏంటో ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు.

ఇక‌ 13వ వారం నామినేషన్స్‌ ప్రక్రియ మొదలైంది. ఇంటి సభ్యులు తగిన కారణాలను చెబుతూ ఇద్దరు సభ్యుల ముఖం ఉన్న బాల్స్‌ను గేటు బయటకు తన్నాలి. ముందుగా కెప్టెన్ ష‌ణ్ముఖ్‌.. కమ్యూనిటీ (ట్రాన్స్‌జెండర్‌) పేరు తీయడం తప్పంటూ కాజల్‌ను నామినేట్ చేశాడు. అలాగే ప్రియాంకను నామినేట్‌ చేస్తూ ఆమె ఫేస్‌ ఉన్న బంతిని ఒక్క తన్ను తన్నాడు. ప్రియాంక.. ఎవరిని నామినేట్‌ చేయాలో అర్థం కావట్లేదని టైం కావాల‌ని అడ‌గ‌డంతో, నామినేషన్స్‌ తెలపకపోతే నేరుగా నామినేట్‌ అవుతావని హెచ్చరించాడు బిగ్ బాస్. దీంతో పింకీ.. సిరిని, కాజల్‌ను నామినేట్‌ చేసింది. శ్రీరామ్‌.. నన్ను అగౌరవపర్చారంటూ మానస్‌, కాజల్‌ను నామినేట్‌ చేశాడు.

ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవకుండా నీ గేమ్‌ నువ్వు ఆడంటూ సిరి.. పింకీ ఫేస్‌ ఉన్న బంతిని తన్నింది. కమ్యూనిటీ అన్న పదం వాడటం తప్పంటూ కాజల్‌ను నామినేట్‌ చేసింది. సన్నీ, మానస్‌.. సిరి, శ్రీరామ్‌లను నామినేట్‌ చేశారు. నేను కమ్యూనిటీ అన్న పదం తీయడం తప్పు అని భూతద్దంలో చూపిస్తున్నారంటూ కాజల్‌.. సిరి, ప్రియాంకను నామినేట్‌ చేసింది. మొత్తంగా ఈ వారం సిరి, మానస్‌, ప్రియాంక, శ్రీరామ్‌, కాజల్‌ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. ఇందులో బ‌య‌ట‌కు వెళ్లే ఛాన్స్ ప్రియాంక‌, కాజ‌ల్‌లో ఒక‌రికి ఉంది. ర‌వి మాదిరిగా చేస్తే శ్రీరామ్ లేదా మాన‌స్ అయినా బయటకు వెళ‌తార‌న‌డంలో సందేహం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment