Bimbisara : నంద‌మూరి హీరో నెత్తుటి సంత‌కం బింబిసార‌.. టీజ‌ర్ అదిరిపోయింది..!

November 29, 2021 1:11 PM

Bimbisara : క‌ళ్యాణ్ రామ్ టైటిల్ పాత్ర‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న చిత్రం బింబిసార‌. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది. మైథిలాజికల్ టచ్‌తో సాగే ‘బింబిసార’ సినిమా టీజర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి ఎంత‌గానో ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే, కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే… ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యంమేలేసింది. అదే త్రిగర్దన సామ్రాజ్యపు నెత్తుటి సంతకం.. బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం.. అనే డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది.

Bimbisara : నంద‌మూరి హీరో నెత్తుటి సంత‌కం బింబిసార‌.. టీజ‌ర్ అదిరిపోయింది..!

బింబిసార చిత్రంలో క్యాథ‌రిన్ ట్రెసా, సంయుక్తా మీన‌న్‌, వ‌రీనా హుస్సేన్ కథానాయికలుగా న‌టిస్తున్నారు. కోవిడ్ రెండు సార్లు ప్ర‌భావం చూప‌డం, గ్రాఫిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఉన్న చిత్రం కావ‌డంతో సినిమా మేకింగ్ ఆల‌స్య‌మైంది. ఇప్పుడు సినిమా నిర్మాణానంతర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

బింబిసార చిత్రాన్ని క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 24న విడుద‌ల చేయ‌బోతున్నారట‌. ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ్‌, చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌గా వ‌ర్క్ చేస్తుండ‌గా ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ఇందులో కల్యాణ్‌రామ్‌ బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా.. తెలుగుతోపాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment