Bigg Boss 5 : బిగ్ బాస్ విన్న‌ర్ క‌న్నా ర‌వి ఎక్కువ పారితోషికం అందుకున్నాడా..?

November 29, 2021 9:40 AM

Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్ష‌కులని అల‌రిస్తున్న బిగ్ గేమ్ షో బిగ్ బాస్ స‌క్సెస్ ఫుల్‌గా 12వారాలు పూర్తి చేసుకుంది. ఈ వారం ర‌వి రూపంలో ఊహించని కంటెస్టెంట్ బ‌య‌ట‌కు వచ్చారు. అత‌ను బ‌య‌ట‌కు రావ‌డాన్ని ర‌వి అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. కావాలనే రవిని ఇంటి నుంచి బయటకు పంపేశారని.. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌కు ప్రియాంక సింగ్, కాజల్ కంటే తక్కువ ఓట్లు ఎలా పడతాయి ? అని అంటున్నారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ విన్న‌ర్ క‌న్నా ర‌వి ఎక్కువ పారితోషికం అందుకున్నాడా..?

మీరు ఓట్ల లెక్క చూపించండి.. అప్పుడే మేము నమ్ముతాము, లేదంటే యాంక‌ర్‌ రవిని కావాలనే ఎలిమినేట్ చేశారనే విషయం నిజమే అని అందరికీ తెలుస్తుంది అంటున్నారు రవి ఫాలోవర్స్. ర‌విని బిగ్‌బాస్‌ పంపించివేయడానికి భారీ రెమ్యునరేషన్‌ కూడా ఒక కారణమన్న వాదన తెరపైకి వచ్చింది. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లలో రవికి అత్యధిక పారితోషికం చెల్లిస్తున్నారట! వారానికి రూ. 7 లక్షల నుంచి రూ.8 లక్షల మధ్యలో ఇస్తున్నారట.

రవి 12 వారాలకే 90 లక్షల రూపాయలు వెనకేసినట్లు తెలుస్తోంది. ఇది బిగ్‌బాస్‌ విజేతకు అందించే 50 లక్షల ప్రైజ్‌మనీ కన్నా ఎక్కువ కావడం గమనార్హం! బిగ్‌బాస్‌ షో ముగింపుకు వచ్చినందున రవికి అంత మొత్తంలో డబ్బులు వెచ్చించలేక ర‌విని ఎలిమినేష‌న్ రూపంలో బ‌య‌ట‌కు పంపంచిన‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి. ఏదేమైనా ర‌వి ఎలిమినేష‌న్‌లో ఏదో సీక్ర‌సీ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్‌బాస్‌ విన్నర్‌ రూ.50 లక్షలతోపాటు, షాద్‌నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సైతం సొంతం చేసుకోనున్నట్లు నాగార్జున‌ వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment