Samantha : స‌మంత అత‌న్నే పెళ్లి చేసుకోవాల‌నుకుంద‌ట‌.. కానీ నాగ‌చైత‌న్య‌ను చేసుకుంది..!

November 28, 2021 6:57 PM

Samantha : టాలీవుడ్ బ్యూటిఫుల్ క‌పుల్స్ లో ఒక‌రిగా స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల‌కు ఎంత‌గానో పేరు ఉండేది. కానీ వీరు విడాకుల నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాక ఆ పేరు వీరికి పోయింది. వీరు విడివిడిగా ఉంటున్న‌ప్ప‌టి నుంచే సందేహాలు మొద‌ల‌య్యాయి. స‌మంత త‌న సోష‌ల్ ఖాతాల్లో అక్కినేని అనే ఇంటి పేరును తొల‌గించాక ఆ అనుమానాలు బ‌ల‌ప‌డ్డాయి. త‌రువాత అవే నిజ‌మ‌య్యాయి. ఇద్ద‌రూ విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Samantha : స‌మంత అత‌న్నే పెళ్లి చేసుకోవాల‌నుకుంద‌ట‌.. కానీ నాగ‌చైత‌న్య‌ను చేసుకుంది..!

అయితే విడాకుల నిర్ణ‌యం త‌రువాత ఆ ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డేందుకు స‌మంత తీర్థ యాత్ర‌లు, టూర్లు వెళ్లి వ‌చ్చింది. త‌రువాత వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ బిజీగా మారింది. మ‌రోవైపు నాగ‌చైత‌న్య కూడా సినిమాల‌తో బిజీగా మారిపోయాడు. కానీ ఇద్ద‌రిలో స‌మంత ఎక్కువగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.

విడాకుల త‌రువాత సినిమాల జోరు పెంచిన స‌మంత తాజాగా హాలీవుడ్ మూవీలోనూ న‌టిస్తున్న‌ట్లు చెప్పింది. అయితే స‌మంత‌కు చెందిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అదేమిటంటే..

స‌మంత అప్ప‌ట్లో న‌టుడు సిద్ధార్థ‌తో ల‌వ్‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటారేమోన‌ని అందరూ ఊహించారు. కానీ వారి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలియ‌దు, బ్రేక‌ప్ చెప్పుకున్నారు. త‌రువాత స‌మంత చైతూను పెళ్లి చేసుకుంది. ఇక ఇటీవ‌ల స‌మంత విడాకుల ప్ర‌క‌ట‌న‌పై సిద్ధార్థ్ ప‌రోక్షంగా స్పందించాడు. అత‌ని ట్వీట్ వైర‌ల్ అయింది.

అయితే అప్ప‌ట్లో సిద్ధార్థ‌నే పెళ్లి చేసుకోవాల‌ని స‌మంత బ‌లంగా ఫిక్స‌యింద‌ట‌. ఇదే విష‌యంపై ఇప్పుడు బాగా చ‌ర్చ న‌డుస్తోంది. అప్ప‌ట్లో స‌మంత‌, సిద్ధార్థ క‌చ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేన‌ని అనుకున్నార‌ట‌. కానీ అలా జ‌ర‌గ‌లేదు. పెళ్లి పీట‌ల వ‌ర‌కు వ‌చ్చిన విష‌యం ఎందుకు అక్క‌డితోనే ముగిసిపోయింది, త‌రువాత ఎందుకు వారు విడిపోవాల్సి వ‌చ్చింది.. అన్న విష‌యాలు తెలియ‌వు. కానీ ఆ సంఘ‌ట‌న వ‌ల్ల సిద్థార్థ్ చాలా డిస్ట‌ర్బ్ అయ్యాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే ఇప్పుడీ విష‌యం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now