Akhanda Pre Release Event : బాల‌య్య‌ని ఆటమ్‌ బాంబ్ అన్న రాజ‌మౌళి.. సీక్రెట్ మాకు చెప్ప‌మ‌ని కోరిన జ‌క్కన్న‌..

November 28, 2021 8:08 AM

Akhanda Pre Release Event : సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం అఖండ‌. డిసెంబ‌ర్ 2న విడుద‌ల కానున్న ఈ చిత్రం శ‌నివారం హైదరాబాద్‌లో ని శిల్పాకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను జ‌రుపుకుంది. ఈ ఈవెంట్‌కు రాజమౌళి, అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర బృందం కూడా సంద‌డి చేసింది. అయితే రాజ‌మౌళి ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. బాల‌య్యని ఆటమ్‌ బాంబ్ అని వ‌ర్ణించ‌డం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది.

Akhanda Pre Release Event : బాల‌య్య‌ని ఆటమ్‌ బాంబ్ అన్న రాజ‌మౌళి.. సీక్రెట్ మాకు చెప్ప‌మ‌ని కోరిన జ‌క్కన్న‌..
Akhanda Pre Release Event

చిత్రంలోని మాస్ సాంగ్‌న‌ని రివీల్ చేసిన రాజ‌మౌళి అనంత‌రం మాట్లాడుతూ.. బాలయ్య ఎనర్జీ, బోయపాటి సీక్రెట్లపై కామెంట్ చేశాడు. బోయపాటి గారు థ్యాంక్స్. ఈ ఆడిటోరియంకే కాకుండా.. మొత్తం ఇండస్ట్రీకి ఊపును తీసుకొచ్చారు. డిసెంబర్ 2 నుంచి అన్ని థియేటర్లలో అందరికీ ఇంతే ఆనందం.. తెలుగు వాళ్లకు ఇంత ఆనందం రావాలి.. రావాలి కాదు.. వస్తుంది. కచ్చితంగా చెబుతున్నాను.

బాలయ్య బాబు ఆటమ్‌ బాంబ్.. దాన్ని ఎలా ప్రయోగించాలో బోయపాటి గారికి తెలుసు.. ఆ సీక్రెట్ అందరికీ చెప్పాలి.. ఆయన ఆ సీక్రెట్ ఎలా చెబుతాడో.. మీరు కూడా మీ సీక్రెట్ చెప్పాలి. ఆ డ్యాన్స్ ఏంటి.. ఆ ఎనర్జీ ఏంటి.. ఇది కేవలం మచ్చుతునకే.. ఫస్ట్ డే ఫస్ట్ షో.. నో వేర్ ఎల్స్.. థియేటర్లో.. పెద్ద హిట్ అవ్వాలి.. ఇండస్ట్రీకి మంచి ఊపు రావాలి.. తమన్ మంచి సాంగ్స్ ఇచ్చావ్.. నిర్మాతకు థ్యాంక్స్.. అని పేర్కొన్నారు రాజ‌మౌళి. ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment