Samantha : చాలా రోజుల త‌ర్వాత ఎట్టకేలకు విడాకులపై స్పందించిన స‌మంత‌

November 27, 2021 8:52 AM

Samantha : తొమ్మిదేళ్ల పాటు ప్రేమ‌లో మునిగి తేలి చివ‌ర‌కు పెద్ద‌ల అంగీకారంతో ఘ‌నంగా పెళ్లి చేసుకున్న జంట స‌మంత- నాగ చైత‌న్య. అంద‌మైన జంట‌ని చూసి దిష్టి త‌గిలిందో ఏమో తెలియ‌దు కానీ పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇకపై తాము భార్యాభర్తలుగా ఉండబోమని, కేవలం స్నేహితులుగా కొనసాగుతామంటూ ఇరువురు కూడా అఫిషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చి షాకిచ్చారు. దీంతో ఈ బ్రేకప్ వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

Samantha responded on divorce finally

విడాకుల ప్రకటన అనంతరం అటు సమంత, ఇటు నాగ చైతన్య వేరు వేరు గృహాలకు షిఫ్ట్ అయి తమ తమ కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇద్ద‌రూ వారి వారి సినిమాల‌తో బిజీ అయిపోయారు. స‌మంత అయితే బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ఇలా అన్ని ప్రాజెక్టుల‌కు ఓకే అంటోంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డు ఓ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఇందులో విక్కీ కౌశ‌ల్, తాప్సీ, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా కూడా ఉన్నారు. వీరు చిట్ చాట్ చేశారు.

చిట్ చాట్‌లో 2021 ఎలా గ‌డిచింద‌ని స‌మంత‌ని ప్ర‌శ్నించ‌గా, అందుకు స్పందించిన సామ్.. ఈ ఏడాది నా జీవితంలో చాలా క్లిష్ట‌మైన సంవ‌త్సరం అంటూ కామెంట్స్ చేసింది. డిసెంబ‌ర్ 6న ఇందుకు సంబంధించి పూర్తి వీడియో బ‌య‌ట‌కు రానుంది. విడాకుల త‌ర్వాత స‌మంత చాలా మ‌నోవేద‌న‌కు గురైంది. దాని నుండి బ‌య‌ట ప‌డేందుకు సామ్ చాలా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ముఖ్యంగా వ‌రుస ప్రాజెక్ట్‌లు చేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఈ ఏడాది తన జీవితంలో అత్యంత విచారకరమైన సంవత్సరం అని సమంత చెప్పింది. అంటే.. విడాకులతో తాను తీవ్రంగా మనస్థాపం చెందినట్లు స్పష్టమవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment