Evaru Meelo Koteeshwarulu : ఎన్టీఆర్ షోలో మహేష్ బాబు ఎంత గెలుచుకున్నారో తెలుసా?

November 26, 2021 5:27 PM

Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం విశేష ఆదరణ దక్కించుకుని దూసుకుపోతోంది. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో కోటి రూపాయలను గెలుచుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి కేవలం కంటెస్టెంట్లు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా హాజరవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

Evaru Meelo Koteeshwarulu do you know how much mahesh won in that show

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, సమంత, డైరెక్టర్ కొరటాల శివ, రాజమౌళిలు హాజరై ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచారు. ఇక ఈ కార్యక్రమానికి మహేష్ బాబు వస్తున్నారు అంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కార్యక్రమం త్వరలోనే ప్రసారం కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహేష్ ఎంతో అద్భుతంగా గేమ్‌ ఆడారని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ కార్యక్రమం ద్వారా 25 లక్షల రూపాయలను గెలుచుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కానుందని తెలియడంతో మహేష్ అభిమానులు, అటు ఎన్టీఆర్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు ఒకే వేదికపై సందడి చేస్తుంటే ఈ కార్యక్రమం రేటింగ్స్ కూడా అమాంతం పెరిగిపోతాయని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment