NTR : ఈఫిల్ ట‌వ‌ర్ ముందు ఫొటోల‌కు ఫోజులిచ్చిన ఎన్టీఆర్..!

November 26, 2021 7:33 PM

NTR : కొన్నాళ్లుగా క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతూ వచ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కుటుంబంతో విహార యాత్ర‌లో ఉన్నాడు. రీసెంట్‌గా ఎన్టీఆర్ ప్యారిస్‌కి వెళ్లగా ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఆయ‌న ఈఫిల్ ట‌వ‌ర్‌ని సంద‌ర్శించాడు. ఈఫిల్ ట‌వర్ ముందు నిలుచొని ఫొటో దిగ‌గా, ఆ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. న్యూ లుక్ లో క‌నిపిస్తున్న ఎన్టీఆర్‌ని చూసి ఫ్యాన్స్ మైమ‌ర‌చిపోతున్నారు.

NTR :at Eiffel tower enjoying with family

ఎన్టీఆర్‌ తన ఫ్యామిలీ విషయాలను.. తన తనయుల ఫోటోలను చాలా అరుదుగా పంచుకుంటాడు. చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్ చేశారు తారక్. ఈ క్రమంలో తన పెద్ద కుమారుడు అభయ్ రామ్‏ను ఈఫిల్ టవర్ వద్ద ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ త‌ర్వాత లోకల్‌ ట్రెయిన్‌లో ప్రయాణిస్తూ తన చిన్న కుమారుడు భార్గవ్ రామ్‏తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వెండితెర‌పై అల‌రించ‌డ‌మే కాకుండా బుల్లితెర‌కు హోస్ట్‌గాను వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ”బిగ్ బాస్” షోకు హోస్ట్ గా వ్యవహరించిన ఆయ‌న తాజాగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో ఎండ్‌కు వచ్చింది. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ కూడా పూర్తైయింది. ఈ క్ర‌మంలోనే భార్య, కుమారులైన అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి యూరప్ టూర్‌కు వెళ్లాడు. వ‌చ్చిన త‌ర్వాత కొర‌టాల శివ ప్రాజెక్ట్ మొద‌లు పెట్ట‌నున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment