Samantha : హాలీవుడ్ సినిమాలో నటించనున్న సమంత.. అలాంటి పాత్రలో..?

November 26, 2021 11:59 AM

Samantha : నాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత కెరీర్ పాతాళానికి ప‌డిపోతుంద‌ని, ఆమె ప‌ని అయిపోయిన‌ట్టేన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఆమె జెట్ స్పీడ్‌తో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతోంది. కేవ‌లం తెలుగులోనే కాదు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల‌పై కూడా దృష్టి సారిస్తోంది. రీసెంట్‌గా రెండు సౌత్‌ మూవీస్ ను ప్ర‌క‌టించింది స‌మంత‌. ఇందులో ఒక‌టి శ్రీదేవీ మూవీస్ వారు నిర్మించే సినిమా కాగా, మరొకటి డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించే సినిమా.

Samantha may act in hollywood movie in that character

ఈ రెండు సినిమాలు అటు తెలుగు, ఇటు తమిళంలోనూ నిర్మించబోతున్నారు. త్వరలో ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు రానున్నాయని, సమంత ఈ రెండు సినిమాలకు ఒకేసారి డేట్స్ సర్దుబాటు చేసిందని.. సమాంతరంగా ఈ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఓ బేబీ నిర్మాత సునీత తాటి 2004లో వచ్చిన అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్ లవ్ అనే నవల ఆధారంగా అరేంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

బాఫ్టా అవార్డును సొంతం చేసుకున్న ఫిలిఫ్ జాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. ఇందులో స‌మంత కూడా న‌టిస్తుండ‌గా, ఆమె పాత్ర బైసెక్సువ‌ల్ అని తెలుస్తోంది. త‌మిళ అమ్మాయి అయిన ఈమె స్వతంత్ర ఆలోచనలతో పెరిగే అమ్మాయి పాత్రలో కనిపిస్తుందట. ఇంట్లో అరేంజ్ మ్యారేజ్ చేయాలని ఒత్తిడి ఉంటుందట. కానీ సమంత పాత్ర మాత్రం తన సొంత ఆలోచనలతో జీవితాన్నిఎంచుకుంటుందట. ఇది ఛాలెంజింగ్‌గా ఉంటుంద‌ని స‌మంత ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఓ బేబీ తరువాత మళ్లీ సునీతతో పని చేయడం ఆనందంగా ఉందని స్ప‌ష్టం చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment