Samantha : నాగ‌చైత‌న్య నుంచి స‌మంత విడిపోయింది.. అందుకేనా..? అస‌లు కారణం అదే..?

November 26, 2021 8:37 AM

Samantha : టాలీవుడ్‌లో స‌మంత‌, నాగ‌చైత‌న్య మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా ఉన్నారు. అస‌లు వారిద్ద‌రూ విడిపోతార‌ని ఎవ‌రూ అనుకోలేదు. వారి విడాకుల నిర్ణ‌యం ఎంతో మందిని షాక్‌కు గురి చేసింది. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుని త‌రువాత పెద్ద‌ల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగానే ఉండేవారు. కానీ వారు ఎందుకు విడిపోయార‌న్న విష‌యంపై ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త లేదు.

Samantha divorced naga chaithanya for that reason

అయితే నాగ‌చైత‌న్య నుంచి స‌మంత విడిపోవ‌డం వెనుక ఓ బ‌ల‌మైన కార‌ణ‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది. చైతూ ఆమెను ఏదో అని ఉంటాడ‌ని.. కానీ బ‌య‌టకు చెప్ప‌లేని స‌మంత తీవ్రంగా హ‌ర్ట్ అయింద‌ని.. అందువ‌ల్లే ఆమె ఇష్టం లేకున్నా చైత‌న్య నుంచి విడిపోయింద‌ని తెలుస్తోంది. అయితే స‌మంత హ‌ర్ట్ అయిన విష‌యాన్ని మ‌నం తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే తెలుస్తుంది.

ఇటీవ‌ల నాగ‌చైత‌న్య బ‌ర్త్ డేకు అంద‌రూ విషెస్ చెప్పారు. కానీ స‌మంత చెప్ప‌లేదు. పైగా త‌న కుక్క బ‌ర్త్ డేకు విషెస్ చెబుతూ సోష‌ల్ మీడియాలో ఏకంగా పోస్ట్‌నే పెట్టింది. దీంతో స‌మంత‌పై అక్కినేని అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే చైత‌న్య గతంలో ఏదో అని ఉంటాడ‌ని, అందువ‌ల్లే స‌మంత హ‌ర్ట్ అయి విడాకులు ఇచ్చింద‌ని.. ఆ విష‌యం తాజాగా ఆమె చేసిన బ‌ర్త్ డే పోస్టును చూస్తే అర్థ‌మ‌వుతుంది.

సాధార‌ణంగా విడాకులు అయినాక కూడా సెల‌బ్రిటీల జంట‌లు ముఖ్య‌మైన వేడుక‌ల‌కు వెళ్తుంటారు. ఆయా సంద‌ర్భాల్లో విషెస్ చెప్పుకుంటారు. కానీ స‌మంత.. చైతూకు బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌లేదు. దీంతో ఆమె బాగానే హ‌ర్ట్ అయింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. రీసెంట్‌గా ఆమె పెడుతున్న సందేశాత్మ‌క పోస్ట్‌లు కూడా ఆమె హ‌ర్ట్ అయిన విష‌యాన్నే స్ప‌ష్టం చేస్తున్నాయి. క‌నుక ఆమె హ‌ర్ట్ అయిన‌ట్లు బ‌లంగా న‌మ్మ‌వ‌చ్చు. మ‌రి ఆమెను హ‌ర్ట్ చేసేంత‌గా నాగ‌చైత‌న్య లేదా అత‌ని కుటుంబ స‌భ్యులు ఏం అన్నారు ? ఏం చేశారు ? అన్న‌ది మాత్రం తెలియ‌డం లేదు. కానీ స‌మంత తీరును చూస్తే తీవ్రంగా హ‌ర్ట్ అయిన‌ట్లు అవ‌గ‌తం అవుతుంది. క‌నుక విడాకుల‌కు కార‌ణం అదేన‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment