Samantha : సమంతకు అదృష్టం మామూలుగా లేదు..!

November 25, 2021 8:22 PM

Samantha : విడాకుల త‌ర్వాత స‌మంత ఎంత బిజీగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు నిర్మాత‌లు ఆమె వెనుక క్యూ క‌డుతున్నారు. చైత‌న్య‌తో వివాహం త‌ర్వాత ప‌రిమితంగా సినిమాలు చేస్తూ వ‌స్తున్న ఆమె విడిపోయిన త‌ర్వాత వ‌రుస సినిమాలు చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోంది. రెండు ద్విభాషా చిత్రాలకు ఒకే చెప్పింది. అందులో ఓ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌, మ‌రో చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ సంస్థ‌ల్లో చేస్తోంది.

Samantha has luck that she reportedly bagged in for another movie

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న‌ల్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప ది రైజ్’ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేస్తోంది. ఈ సాంగ్ కోసం ఏకంగా స‌మంత‌కు కోటిన్న‌ర రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్‌గా ఇస్తున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. స‌మంత త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లోకి ప్ర‌వేశించ‌నుంద‌ని, హీరోయిన్ తాప్సీ ఈ సినిమాను నిర్మించ‌బోతుంద‌ని వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ఇక ఇప్పుడు త్రివిక్ర‌మ్ – మ‌హేష్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రంలోనూ స‌మంత క‌థానాయిక అని అంటున్నారు.

2005లో అతడు, 2010లో ఖలేజా లాంటి సినిమాలు చేసిన తర్వాత ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు ఫ్యాన్స్. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప‌ట్టాలెక్క‌నుండ‌గా, ఇందులో పూజా హెగ్డేని క‌థానాయికగా అనుకున్నారు. కానీ ప్రాజెక్ట్‌లకు డేట్స్‌ సర్దుబాటు చేయడంలో ఆమె సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మ‌హేష్ సినిమా ఆఫ‌ర్ వ‌దులుకున్న‌ట్టు తెలుస్తోంది. పూజా నో అన‌డంతో ఆ స్థానంలో స‌మంత వ‌చ్చి చేరినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now