సమంత.. వాటీజ్‌ దిస్‌.. ఇలా చేసిందేంటి ? చైతూకు విలువ లేదా..?

November 25, 2021 12:11 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చేసిన పనికి నెటిజన్లు మండి పడుతున్నారు. నాగచైతన్య నుండి సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆమెపై ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తన మానసిక ఒత్తిడి నుండి బయట పడేందుకు ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేసింది. ప్రస్తుతం తన సినిమాలపై ఫోకస్ చేసి పాన్ ఇండియా హీరోయిన్ గా మారేందుకు బిజీ అయ్యింది. సమంత సాధారణంగానే తన సోషల్ మీడియాలో బిజీగా ఉంటోంది. ఆమె విడాకుల తర్వాత కూడా ఏవో పోస్టులు పెడుతూ వైరల్ అవుతూనే ఉంది.

what samantha done is it right no value to naga chaitanya

రీసెంట్ గా నాగచైతన్య బర్త్ డే అనే విషయం తెలిసిందే. ఎంతోమంది ప్రముఖులు ఆయన బర్త్ డే కి స్పెషల్ విషెస్ తెలిపారు. కానీ తన మాజీ భార్య సమంత మాత్రం చైతూకి విషెస్ చెప్పలేదు. ఇదిలా ఉండగా నాగచైతన్య బర్త్ డే తర్వాతి రోజు తన పెట్ డాగ్ అయిన హాష్ కి బర్త్ డే విష్ చెప్పింది. దాంతో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ.. ఇన్ స్టా స్టోరీస్ లో కొన్ని ఫోటోస్ ని కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ కి నెటిజన్లు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. తన పెట్ డాగ్ కి ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఆమె మాజీ భర్త చైతన్యకు ఇవ్వలేదంటూ మండిపడుతున్నారు.

https://www.instagram.com/p/CWqd1edhrjB/?utm_source=ig_web_copy_link

కనీసం ఒక ఫ్రెండ్ లాగా కూడా చైతన్యను ట్రీట్ చేయలేకపోయావా సామ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక సమంత కావాలనే ఇలా చేస్తుందంటూ అక్కినేని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత తెలుగు శాకుంతలం సినిమా పూర్తి చేసుకుంది. అలాగే తమిళంలో కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమాను కూడా కంప్లీట్ చేసుకుంది. రీసెంట్ గా హీరోయిన్ నయనతార బర్త్ డే ఈవెంట్ లో కూడా పార్టిసిపేట్ చేసి ఆమెకు విషెస్ తెలిపింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment