Samantha : స‌మంత‌కు ఇంత పొగ‌రా.. క‌నీసం చైతూకి విషెస్ చెప్పే తీరిక కూడా లేదా ?

November 24, 2021 11:49 AM

Samantha : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో స‌మంత‌, నాగ చైత‌న్య జంట ఒక‌టి అనుకునే వాళ్లు. `ఏం మాయ చేశావె` చిత్రంతో ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఏర్ప‌డ‌గా, ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్ల జర్నీ తర్వాత 2017 అక్టోబర్‌ 6న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి రూ.10 కోట్లకు పైగా ఖర్చు అయినట్టు సమాచారం.

Samantha has pride why she not tell birthday wishes to naga chaithanya

అక్కినేని కోడ‌లిగా స‌మంత ఎంతో మంది దృష్టిని ఆక‌ర్షించింది. అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోష‌న్ పొందాక స‌మంత ఆచితూచి సినిమాలు చేయ‌డం, ప‌ద్ద‌తిగా మెలగ‌డం చేసింది. అయితే దాదాపు నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట అక్టోబ‌ర్ 2న తాము విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఎవరి దారిలో వాళ్లం నడవాలనుకుంటున్నాం. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మాది పదేళ్ల స్నేహబంధం. ఈ డిఫికల్ట్ సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు.. అని నాగచైతన్య ప్రకటించారు. ఇదే పోస్ట్ ను స‌మంత కూడా త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

అయితే విడిపోయినా తాము స్నేహితులులా ఉంటామ‌ని చెప్పిన ఈ జంట ఆ మాట‌లు ఉట్టివేన‌ని తేల్చారు. తాజాగా చైతూ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న‌కు చాలా మంది శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. స‌మంత కూడా విష్ చేస్తుంద‌ని అని అనుకున్నారు. కానీ ఆమె సైలెంట్‌గా ఉండ‌డంతో నెటిజ‌న్స్.. ఎందుకంత గ‌ర్వం.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స‌మంత‌.. మాజీ భ‌ర్త‌కు విషెస్ చెప్పే తీరిక లేదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment