Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్ చివ‌రి లేఖ‌.. భావోద్వేగానికి గుర‌వుతున్న అభిమానులు..

November 24, 2021 12:20 PM

Uday Kiran : ఒకప్పుడు టాలీవుడ్‌లో లవర్‌ బాయ్‌గా ఒ వెలుగు వెలిగాడు దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌. తేజ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘చిత్రం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్‌ మూవీతోనే సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన ఉదయ్‌ కిరణ్‌ సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోగా ఎదిగాడు. అతడు నటించిన శ్రీరామ్‌ మూవీ ప్లాప్‌ అవ్వడంతో కొంతకాలం సినిమాలకు దూరమయ్యాడు.

Uday Kiran last letter trending in social media fans are very sad

ఆర్ధిక ఇబ్బందులు, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా జనవరి 5, 2014న ఉద‌య్ కిర‌ణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఈయన రాసిన ఎమోషనల్ లెటర్ ఒకటి బయటకు వచ్చింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషితా.. మా అమ్మ అంటే ఎంత ఇష్టమో… ఆ తర్వాత అంతటి స్థాయిలో నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వు. మన మధ్య గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధ పడుతున్నారు. వారికి ఈ బాధ ఉండకూడదు.

Uday Kiran last letter trending in social media fans are very sad

అతడు మంచి వాడు అని నువ్వు నమ్ముతున్నావు. కానీ అతడు మంచివాడు అస్సలు కాదు. నా మాట విను. నువ్వు నిజం తెలుసుకునే రోజు నీ పక్కన ఉదయ్ ఉండడు. నువ్వు ఒకసారి అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకో. నాకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధ పడుతున్నారు.

అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు. అమ్మా నిన్ను ఓ సారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా’ అని ఉద‌య్ త‌న చేతి రాత‌తో లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment