Samantha : సమంత అభిమానులకు బంపర్‌ న్యూస్‌.. ఇంతకు మించింది లేదు..!

November 23, 2021 3:42 PM

Samantha : విడాకుల ప్రకటన తర్వాత సమంత తన దృష్టిని పూర్తిగా తన కెరియర్ పై పెట్టింది. ఈ క్రమంలోనే వరుస సినిమా కథలను వింటూ పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, మరో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా పుష్ప సినిమాలో ఐటమ్‌ సాంగ్ చేయడానికి కూడా ఈమె ఒప్పుకుంది. ఇలా తనకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకుండా పూర్తిగా తన కెరియర్ పై దృష్టి పెట్టింది.

bumper news to Samantha fans she soon may go for bollywood film shooting

ఇక సమంత ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి అని చెప్పవచ్చు. కాగా సమంతతో ఎంతో సన్నిహితంగా ఉండే ఒక హీరోయిన్ ప్రొడక్షన్ లో సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా ద్వారా సమంత బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమైందని వార్తలు వినబడుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన తెలియజేయు నట్లు సమాచారం. ఇక ఈమె నటించిన శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా సమంత వరుస అవకాశాలు అందుకుంటూ తన రెమ్యూనరేషన్ విషయంలో కూడా భారీగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిసిందే.

అయితే నిన్న మొన్నటి వరకు సమంత విడాకుల బాధ నుంచి బయట పడేందుకు టూర్లు వేసింది. పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను కూడా సందర్శించింది. ప్రస్తుతం ఎక్కడికీ వెళ్లడం లేదు. కనుక సినిమాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో పుష్ప మూవీ ఐటమ్‌ సాంగ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. దాని తరువాత ఆమె బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుందని తెలుస్తోంది. ఇదే నిజం అయితే ఆమె అభిమానులకు ఇంతకన్నా పెద్ద న్యూస్‌ ఏదీ ఉండదు. వారు నిజంగా పండగ చేసుకునే విషయం ఇది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment