Kaikala Satyanarayana : కైకాల మృతి అంటూ త‌ప్పుడు ప్రచారం.. ఖండించిన కూతురు..

November 23, 2021 12:16 PM

Kaikala Satyanarayana : 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల.. ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారుగా 777 సినిమాల్లో నటించి.. తెలుగు అభిమానులను అలరించారు. మూడు రోజుల క్రితం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన స‌త్య‌నారాయ‌ణ‌ను కుటుంబ స‌భ్యులు జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిట‌ల్స్‌కు చికిత్స నిమిత్తం త‌ర‌లించారు. అప్ప‌ట్నుంచీ ఐసీయూలో వెంటిలేట‌ర్‌పై ఉంచి కైకాల‌కు చికిత్స అందిస్తూ వ‌స్తున్నారు.

Kaikala Satyanarayana dead news it is fake says his daughter

ఐసీయూలో చికిత్స పొందుతున్న సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ స్పృహలోకి వ‌చ్చిన విష‌యం తెలుసుకున్న చిరంజీవి ఇటీవ‌ల‌ క్రిటికల్‌ కేర్‌ డాక్టర్‌ సుబ్బారెడ్డి సహాయంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన త్వరితగతిన కోలుకుంటారన్న పూర్తి నమ్మకం ఆ క్షణం నాకు కలిగింది. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితో ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

కైకాల మ‌ర‌ణించారంటూ మంగ‌ళ‌వారం వాట్సాప్‌లో త‌ప్పుడు ప్ర‌చారం మొద‌లైంది. అయితే ఆ త‌ప్పుడు స‌మాచారాన్ని ప్ర‌చారం చేయొద్ద‌నీ, త‌మ తండ్రి కోలుకుంటున్నార‌నీ.. స‌త్య‌నారాయ‌ణ కుమార్తె ర‌మాదేవి విజ్ఞ‌ప్తి చేశారు.

నాన్న‌గారి ప‌రిస్థితి బాగానే ఉంది. ఆయ‌న కోలుకుంటున్నారు. బాగా స్పందిస్తున్నారు. అంద‌రితో మాట్లాడుతున్నారు. నిన్న మాదాల ర‌విగారు వ‌చ్చారు. ఆయ‌న‌తో కూడా మాట్లాడి థ‌మ్స‌ప్ కూడా చూపించారు. కాబ‌ట్టి ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. ద‌య‌చేసి త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేయొద్దు.. అని ఆమె అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment