Shruti Haasan : బిగ్‌ బాస్‌ షోను హోస్ట్‌ చేయనున్న శృతి హాసన్‌..?

November 23, 2021 11:19 AM

Shruti Haasan : లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. క‌మ‌ల్ ఇటీవ‌ల తన సొంత క్లాత్ బ్రాండ్ ప్రారంభోత్సవానికి యూఎస్ వెళ్లారు. తిరిగి వచ్చాక దగ్గు మొదలైంది. దీంతో లక్షణాలు అనుమానాస్పదంగా ఉండడంతో పరీక్షలు చేయించుకున్నారు. కమల్ కు పరీక్షలు నిర్వహించిన వైద్యులు కోవిడ్ పాజిటివ్ అని తేల్చారు. దీంతో కమల్ హాసన్ కు ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Shruti Haasan may host the bigg boss show

త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో క‌మ‌ల్ హాస‌న్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందించారు. అమెరికా నుంచి వచ్చాక దగ్గు వచ్చింది. పరీక్షలు చేయించుకోగా కరోనా అని తేలింది. దీంతో చికిత్స తీసుకుంటున్నాను. ఇంకా కరోనా ప్రభావం తగ్గలేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి, అని కమల్ ట్వీట్ చేశారు. కమల్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు.. ఆందోళన చేనవలసిన అవసరం లేదని.. ప్రస్తుతం కమల్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంఎన్ఎం పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

కమల్ కి కరోనా సోకడంతో కొంత కాలం ఆయన ఐసోలేషన్ లో ఉండాలి. ప్రస్తుతం తమిళంలో బిగ్ బాస్ సీజన్ 5 కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో బిగ్ బాస్ తమిళ్ 5 కి ఎవరు టెంపరరీ హోస్ట్ గా వ్యవహరిస్తారు అనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ ఆ బాధ్య‌త‌లు మోయ‌నుంద‌ని స‌మాచారం. గ‌తంలో నాగార్జున లేన‌ప్పుడు బిగ్ బాస్ షోని రమ్య‌కృష్ణ‌, స‌మంత ఆస‌క్తిక‌రంగా న‌డిపించిన విష‌యం తెలిసిందే. దీంతో ఇప్పుడు కమల్‌ ఆ షోకు దూరం కావడంతో అతని కుమార్తె శృతి పేరు వినిపిస్తోంది. మరి ఆమె ఆ షోను హోస్ట్‌ చేస్తుందా, లేదా.. అన్నది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment