RRR Movie : ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్ స‌ర్‌ప్రైజింగ్ లుక్ విడుద‌ల‌.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌..!

November 23, 2021 11:10 AM

RRR Movie : ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఏ అప్‌డేట్ వ‌చ్చినా కూడా అది ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తుంటుంది. ఆ మ‌ధ్య ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా, దానికి మామూలు ఆదరణ దక్కలేదు. ఈ గ్లింప్స్‌లో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ చాలా తక్కువసేపే కనిపించినా.. ఎప్పటిలాగానే తన విజువల్స్‌తో మార్కులు కొట్టేశాడు రాజమౌళి.

RRR Movie  ntr surprising look revealed fans are very happy

ఇక ఈ సినిమా నుండి విడుదలయిన దోస్తీ పాట‌, ‘నాటు నాటు’ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రెండూ మంచి ఆద‌ర‌ణను ద‌క్కించుకున్నాయి. అయితే ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీపై సోషల్ మీడియాలో ఓ రూమర్ మొదలయింది. డిసెంబర్ 4న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుందని నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వార్త నిజమయితే బాగుంటుందని ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇదిలా ఉండగా కొద్ది సేప‌టి క్రితం ఎన్టీఆర్‌కి సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్ విడుద‌ల చేశారు. ఇందులో ఎన్టీఆర్ ముఖానికి రక్త‌పు మ‌ర‌క‌ల‌తో చాలా ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తున్నాడు. ఎన్టీఆర్ లుక్ చూసి అభిమానులు స్టన్ అవుతున్నారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా, ఇవి చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నమే ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ సునీలవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment