Aamir Khan : మ‌రో వివాహం చేసుకోబోతున్న అమీర్ ఖాన్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

November 23, 2021 9:51 AM

Aamir Khan : దేశం గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల‌లో అమీర్ ఖాన్ త‌ప్ప‌క ఉంటారు. 2001లో విడుదలైన లగాన్ సినిమా అమీర్ ఖాన్ ని సూపర్ స్టార్ గా మార్చింది. 2007లో తారేజమీన్ పర్ సినిమాను తీసి తొలిసారి దర్శకుడిగా మారారు అమీర్. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో సంస్థను స్థాపించారు. 2008లో తీసిన 3 ఇడియట్స్ బాలీవుడ్‌లో రూ.375 కోట్లు వసూలు చేసింది. ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది. అయితే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవలే తన భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చి వార్త‌ల‌లోకి ఎక్కారు.

Aamir Khan getting married for the 3rd time surprise to fans

అమీర్ మొదటగా 1986 లో రీనా దత్తాని పెళ్లి చేసుకుని సరిగ్గా 15 ఏళ్ళకే విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ తర్వాత 2005 సంవత్సరంలో కిరణ్ రావు ని వివాహం చేసుకొని అదే 15 ఏళ్ళకి మరోసారి విడాకులు తీసుకున్నారు. అయితే ఈసారి ఈ బాలీవుడ్ నటుడు విడాకులు తీసుకోడానికి కారణం మరొక బాలీవుడ్ హీరోయిన్ అని అటు సోషల్ మీడియాతోపాటు ఇటు బాలీవుడ్ లోనూ టాక్ వినిపిస్తోంది.

“దంగల్” చిత్రంలో అమీర్ ఖాన్ కి కూతురుగా నటించిన నటి ఫాతిమా సనా షేక్ తో అమీర్ ఖాన్ ప్రేమలో ఉన్నాడని అందువల్లనే ఆ నటికి ఆ తర్వాత చిత్రమైన “ది థగ్స్ అఫ్ హిందూస్తాన్” చిత్రంలో అమీర్ సరసన నటించడానికి అవకాశం కూడా ఇచ్చారని సమాచారం. ఫాతిమా.. అమీర్ ను కచ్చితంగా కలుస్తుందని, వీరిద్దరూ కలిసి చాలా పార్టీలకి కూడా హాజరయ్యారని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ప్రస్తుతం 29 ఏళ్ళు ఉన్న ఈ భామను 56 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న అమీర్ ఖాన్ ఇప్పుడు ఆమెని మూడో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తుండ‌గా, ఇది అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment