Bigg Boss 5 : ప‌థ‌కం ప్ర‌కార‌మే జ‌స్వంత్‌ని ఎలిమినేట్ చేశారా.. హౌజ్‌లో ఏం జ‌రుగుతోంది..?

November 22, 2021 4:40 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 చాలా ఆస‌క్తికరంగా కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ షో ఆస‌క్తిని క‌నబ‌రుస్తూ వివాదాల‌లోనూ చిక్కుకుంటూ ఉంటోంది. జ‌స్వంత్ ఎలిమినేష‌న్ పెద్ద వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. బ‌య‌ట స‌ర‌దాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న జెస్సీని అనారోగ్యం పేరు చెప్పి ఎందుకు బ‌య‌ట‌కు పంపారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో జస్వంత్ పడాల అలియాస్‌ జెస్సీ మొదటి నుంచి కూడా ఒక చిన్న పిల్లాడి తరహాలో కొనసాగుతూ వచ్చాడు.

Bigg Boss 5 jessie removed from house all is solid plan of organizers

జెస్సీ ఫ్యాషన్ వరల్డ్ లో తప్పితే బయట జనాలకు పెద్దగా తెలియదు. అయితే అతను బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం కొన్ని రోజులకే ఒక చిన్న పిల్లాడి మనస్తత్వంతో కనిపించాడు.. అని కంటెస్టెంట్స్ అందరూ కూడా కామెంట్ చేశారు. నెటిజన్లు కూడా అదే తరహాలో స్పందించారు. మొత్తానికి పది వారాల పాటు కొనసాగిన జెస్సీ ఎవరూ ఊహించని విధంగా అనారోగ్యం కారణంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.

అయితే పక్కా ప్లానింగ్ ప్రకారమే అంతా జరుగుతుందని, ఎలిమినేషన్ నుండి విన్నర్స్ వరకు షో నిర్వాహకులు ముందే స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంటారని సోషల్ మీడియాలో కొందరు ఈ షోను వ్యతిరేకిస్తూ.. వాదిస్తున్నారు.

ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్స్ కూడా ఇటు ప్రేక్షకుల ఓట్లతోపాటు షో నిర్వాహకుల ప్లాన్ ప్రకారమే జరిగిందని టాక్ నడుస్తోంది. విందులు, వినోదాలలో జెస్సీ భేషుగ్గా ఎంజాయ్ చేస్తుండ‌గా, అనారోగ్యంతో ఏదో హ‌డావిడి చేసిన బ‌య‌ట‌కు పంపార‌ని కొంద‌రు వాపోతున్నారు. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment