Rakul Preet Singh : పెళ్లి ఇప్పుడే చేసుకోను.. ర‌కుల్ కామెంట్స్ వెనుక ఉన్న అర్థమేంటి ?

November 22, 2021 3:58 PM

Rakul Preet Singh : టాలీవుడ్ గ్లామ‌ర‌స్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ కెరీర్‌ పీక్ స్టేజ్‌లో ఉండగా పెళ్లి దిశగా అడుగులేయబోతుంది.. అంటూ ఇటీవ‌ల తెగ ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. జాకీ భగ్నానీ అనే నటుడితో ఆమె కొంత కాలంగా ప్రేమలో ఉండ‌గా, తన 31వ పుట్టినరోజున ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది. జాకీ భగ్నానీ కూడా ఇన్ స్టా పోస్ట్ ద్వారా రకుల్‌పై తన ప్రేమను తెలియజేశాడు. అయితే వీరి పెళ్లెప్పుడు.. అని అంద‌రూ ఆలోచిస్తున్న క్ర‌మంలో ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేసింది ర‌కుల్.

Rakul Preet Singh says she will not marry now
Rakul Preet Singh says she will not marry now

థ్యాంక్స్ గాడ్ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ర‌కుల్ మాట్లాడుతూ.. నా వ్యక్తిగత జీవితం గురించి అప్పుడు ఎందుకు బయటపెట్టానంటే.. అది ఓ అందమైన విషయం. అందరితో పంచుకోవాలనుకున్నా.పెళ్లికి అంత తొందరలేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్‌పైనే ఉంది. సో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. చేసుకోవాలనుకున్నప్పుడు మీ అందరితో పంచుకుంటాను’ అని పేర్కొంది.  అంటే ఈ అమ్మ‌డి పెళ్లికి మ‌రి కొన్ని సంవ‌త్స‌రాలు స‌మ‌యం ప‌ట్టేలా క‌నిపిస్తోంది.

ర‌కుల్ న‌టించిన థ్యాంక్స్ గాడ్ చిత్రంలో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది ర‌కుల్.

కాగా ఈ అమ్మ‌డు ప్రేమించిన జాకీ భగ్నానీ బాలీవుడ్ నటుడు, నిర్మాతగా రాణిస్తున్నాడు. ఈయన కోల్‌కతాలోని సింధీ ఫ్యామిలిలో జన్మించారు. పూజా ఎంటర్‌టైన్‌‌మెంట్స్ పేరు మీద అతని తండ్రి వషు భగ్నానీ మూవీస్ నిర్మిస్తున్నారు. జాకీ భగ్నానీ.. 2009లో ఓ హిందీ మూవీలో ఇండస్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment