Simbu : సినిమా కోసం 27 కేజీల బ‌రువు త‌గ్గాడా.. నిజంగా షాకింగే..!

November 22, 2021 8:57 AM

Simbu : కొంద‌రు చాలా నిబ‌ద్ధ‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. వారికి తాము చేసే పనిని గౌర‌వంగా భావిస్తూ ఒక్కోసారి రిస్క్‌లు కూడా చేస్తుంటారు. తమిళ్ స్టార్ హీరో శింబు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన నటించిన చాలా సినిమాలు ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. మన్మథ, వల్లభ సినిమాలతో తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నాడు శింబు. ఇక సినిమాల్లో క్యారెక్టర్ కోసం ఎంతైనా కష్టపడతాడు.

Simbu lost 27 kilos of weight for his latest movie

వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా వస్తోన్న సినిమా ‘లూప్‌’. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శింబు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సినిమాకి ముందు నా కెరీర్‌ చాలా డౌన్ లో ఉంది. అందుకే ఈ సినిమా కోసం నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. ముఖ్యంగా నన్ను నేను మార్చుకోవాలని 27 కిలోలు తగ్గాను. ఆహార అలవాట్లు దగ్గర నుంచి మద్యపానం వరకు అన్ని విషయాల్లోనూ చాలా నిబద్దతతో ఉన్నాను. అందుకే ఈ సినిమాలో నేను కొత్తగా కనిపిస్తాను. అన్నట్టు ఇక పై నా ప్రతి సినిమాను తెలుగులో విడుదల చేస్తాను అని చెప్పుకొచ్చారు.

లూప్ చిత్రం ‘సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. రాజకీయ చదరంగంలో ఓ సామాన్యుడికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి ? అతడి జీవితంలో ఒకే సంఘటన మళ్లీ మళ్లీ ఎందుకు జరిగింది ? తనపై పడిన ఓ నింద నుంచి అతడు ఎలా నిరపరాధిగా బయటపడ్డాడన్నదే.. ఈ చిత్ర ఇతివృత్తం. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా కాదిది. కానీ ఇందులో చూపించిన అంశాలతో ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు.. అని శింబు చెప్పుకొచ్చాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment