ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ షురూ.. ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌లు..

May 2, 2021 1:09 PM

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆదివారం బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ మే 7వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో అనేక ఉత్ప‌త్తుల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తున్నారు. ముఖ్యంగా గెలాక్సీ ఎఫ్‌62, పిక్స‌ల్ 4ఎ ఫోన్ల‌తోపాటు ఐఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తున్నారు.

flipkart big saving days sale discounts on phones tvs

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అసుస్, యాపిల్ ఐఫోన్లు, ఎంఐ, రియ‌ల్‌మి, శాంసంగ్‌, పోకో, మోటోరోలా కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొన‌వ‌చ్చు. ఎంఐ టీవీ స్టిక్, అమేజ్‌ఫిట్ బిప్ ఎస్‌, టి-రెక్స్ వాచ్‌లపై రూ.1000 వ‌ర‌కు, అమేజ్‌ఫిట్ జీటీఆర్ 2పై రూ.500, రియ‌ల్‌మి బ‌డ్స్‌పై రూ.300 వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

సేల్‌లో ల్యాప్‌టాప్‌ల‌పై 40 శాతం, టీవీల‌పై 70 శాతం వ‌ర‌కు రాయితీల‌ను పొంద‌వ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో అయితే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే సేల్ ఉన్న‌న్ని రోజులూ రోజూ రాత్రి 12, ఉద‌యం 8, సాయంత్రం 4 గంట‌ల‌కు క్రేజీ డీల్స్ ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment