Mahesh Babu : మ‌రో బిజినెస్ ప్లాన్ చేసిన మ‌హేష్‌.. దూకుడు మాములుగా లేదుగా..!

November 21, 2021 7:46 AM

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిజినెస్‌ల‌లో రాణిస్తున్నాడు. ఇప్పుడు ఏఎంబీ థియేట‌ర్ న‌డిపిస్తున్న మ‌హేష్ బాబు తెలుగులో ఆన్ లైన్ విద్యా బోధన కోసం కొత్త యాప్ ని తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడని స‌మాచారం. దీనికి సంబంధించి ఒక మల్టీ నేషనల్ కంపెనీ తో చర్చలు జరుపుతున్నాడని , దీంట్లో మహేష్ బాబు దాదాపుగా రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Mahesh Babu plans for another business

మహేష్ బాబుతోపాటు ఒక మల్టీ నేషనల్ కంపెనీ భాగస్వామ్యంలో కూడా ఇది రూపొందుతుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లో దీనిపై ఓ క్లారిటీ రానుంది. ప్రస్తుతం మహేష్ బాబు స‌ర్కారు వారి పాట చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్.. జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment