Samantha : విడాకుల త‌రువాత డ‌బ్బు సంపాదించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న స‌మంత‌..?

November 20, 2021 8:09 PM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత కొద్ది రోజుల పాటు కోర్టు కేసులంటూ తిరిగింది. త‌రువాతా ఆ బాధ నుంచి మ‌రిచిపోయేందుకు ఆధ్యాత్మిక క్షేత్రాల‌ను సంద‌ర్శిస్తూ.. ఇత‌ర ప్రాంతాల‌కు టూర్లు కూడా వేసింది. అయితే విడాకుల‌ను అనౌన్స్ చేసిన త‌రువాత నుంచి స‌మంత గోల్ మారిన‌ట్లు తెలుస్తోంది. కేవ‌లం డ‌బ్బు సంపాదించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆమె పెట్టుకుంద‌ని స‌మాచారం. అందులో భాగంగానే వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంద‌ని అంటున్నారు.

Samantha reportedly put one goal after divorce that is money earning

ముఖ్యంగా ఆమె విడాకుల త‌రువాత రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతోపాటు.. ఆహాలో వెబ్ సిరీస్‌, బాలీవుడ్‌లో తాప్సీతో క‌లిసి ఓ మూవీలో న‌టిస్తుంద‌ని అంటున్నారు. ఇక పుష్ప మూవీలో ఐట‌మ్ సాంగ్‌కు ఎలాగూ క‌న్‌ఫాం అయిపోయింది. అందులో ఆమె డ్యాన్స్ చేసినందుకు గాను ఏకంగా ఒక్క పాట‌కే రూ.1.50 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంద‌ని అంటున్నారు.

పుష్ప మూవీలో ఐట‌మ్ సాంగ్ చేసేందుకు స‌మంత ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కండిష‌న్స్‌ను కూడా పెట్టింద‌ట‌. కేవ‌లం 5 రోజులు మాత్ర‌మే ఆమె ఆ సాంగ్‌కు కాల్ షీట్స్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అలాగే పాట షూటింగ్‌ను ఒకే లొకేష‌న్‌లో చేయాల‌ని.. దాన్ని కూడా రామోజీ ఫిలిం సిటీలో చేయాల‌ని చెప్పింద‌ట‌. దీంతో పుష్ప యూనిట్ ఆమె కండిష‌న్స్‌కు ఓకే చెప్పింద‌ని తెలుస్తోంది.

ఇక స‌మంత వ‌రుస సినిమాల‌తో బిజీగా మార‌గా.. విడాకుల అనంత‌రం ఆమె జోరు పెంచింద‌ని తెలుస్తోంది. నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి ఉన్న‌ప్పుడు ఆమె గోల్ వేరే. ఫ్యామిలీ, పిల్లలు.. అని ప్లాన్ చేసిన‌ట్లు గ‌తంలోనే తెలిసింది. అయితే ఇప్పుడు ఆమె విడిపోయింది క‌నుక‌.. ఇప్పుడామె ముందున్న ల‌క్ష్యం ఒక్క‌టే.. డ‌బ్బు సంపాదించ‌డం.. సినిమాల్లో, సిరీస్‌ల‌లో న‌టిస్తూ పేరు తెచ్చుకోవ‌డం. అంతే.. మ‌రి ఎంత కాలం స‌క్సెస్‌ఫుల్‌గా రాణిస్తుందో చూడాలి. అస‌లే అక్కినేని అనే పేరు కూడా పోయింది. మ‌రి ఆమె గ్రాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment